Begin typing your search above and press return to search.

15 సంవత్సరాల తర్వాత కృష్ణవంశీ సినిమాలో రమ్యకృష్ణ

By:  Tupaki Desk   |   15 Oct 2019 6:06 AM GMT
15 సంవత్సరాల తర్వాత కృష్ణవంశీ సినిమాలో రమ్యకృష్ణ
X
దర్శక ధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి' సినిమాలో శివగామి క్యారక్టర్ కి ఎంత పేరొచ్చిందో అందరికీ తెలిసిందే. రాజమౌళి కూడా చాలా సందర్భాల్లో తనకు 'బాహుబలి' లో శివగామి క్యారక్టర్ అంటే మిగిలిన క్యారెక్టర్ల కంటే ఎక్కువ ఇష్టం అని చెప్పాడు. ఇప్పుడు ఇండియాలో ఏ భాషలో అయినా రమ్యకృష్ణ పేరు చెప్తే వెంటనే శివగామి అనేంతగా ఆ పాత్ర సినీ ప్రియులను ఆకట్టుకుంది. 1999లో వచ్చిన 'నరసింహ' సినిమాలో నీలాంబరి క్యారక్టర్ నుండి ఈ మధ్య వచ్చిన శివగామి క్యారక్టర్ వరకు ఆమె కేరీర్ గ్రాఫ్ హద్దులు లేకుండా దూసుకుపోతుంది. కానీ ఆమె భర్త, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది.

కృష్ణవంశీ హిట్ సినిమా తీసి 12 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు కానీ అవేవీ అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. 2004లో కృష్ణవంశీ తీసిన 'శ్రీ ఆంజనేయం' సినిమాలో రమ్యకృష్ణ నటించారు. ఆ తర్వాత తన భర్త తీసిన ఏ సినిమాలోనూ రమ్యకృష్ణ నటించలేదు. దాంతో చాలామంది ఈ ఇద్దరికీ మనస్పర్థలు వచ్చాయని త్వరలోనే విడిపోతారని ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ రూమర్లేనని తేలింది.

ఇంతకాలం తన కెరీర్ గురించే ఆలోచించిన రమ్యకృష్ణ ఇప్పుడు భర్తకి కూడా ఒక హిట్ సినిమా పడాలని కోరుకుంటుంది. అంతేకాదు కృష్ణవంశీ తర్వాత తీయబోయే సినిమాలో ఆమె ఒక పవర్ ఫుల్ క్యారక్టర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈసారైనా కృష్ణవంశీ హిట్ కొట్టి తన క్రియేటివ్ డైరెక్టర్ పేరు నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.