Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూజివ్: బాహుబలి2 ఇంటర్వెల్ సీన్ ఇదే

By:  Tupaki Desk   |   27 April 2017 7:45 AM GMT
ఎక్స్ క్లూజివ్: బాహుబలి2 ఇంటర్వెల్ సీన్ ఇదే
X
బాహుబలి2 మూవీ కోసం ప్రేక్షకులు ఆత్రంగానే ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రతీ చిన్న అప్ డేట్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా బాహుబలి2 నుంచి కొన్ని సీన్స్ లీక్ అయ్యాయనే న్యూస్ రెండు రోజుల నుంచి బాగానే చక్కర్లు కొడుతోంది. ఒకట్రెండు క్లిప్పింగ్స్ వాట్సాప్ లో కూడా షేర్ అయిపోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇంటర్వెల్ సీన్ లీక్ అయిందనే న్యూస్ వైరల్ అవుతోంది.

రాజమౌళి మూవీస్ కి ఇంటర్వెల్ సీన్ ఎంత ప్రాణమో చెప్పాల్సిన పని లేదు. అలాంటి ఇంటర్వెల్ సీన్ లీక్ కావడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు రమ్యకృష్ణ సింహాసనంపై కూర్చున్న ఓ ఇమేజ్ కనిపించే వీడియోను.. బాహుబలి2 లీక్డ్ ఇంటర్వెల్ సీన్ అంటూ నెట్ లో తెగ హల్ చల్ చేసేస్తోంది. ఆ వీడియో చూస్తే అసలు విషయం అర్ధమవుతుంది. ఇది ఓ ఏడాది క్రితం రమ్యకృష్ణ చేసిన ఓ యాడ్ అంతే. అయితే బాహుబలికి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని శివగామి పాత్ర గెటప్ తో ఆ యాడ్ ను రూపొందించారు. అప్పట్లో ఈ ప్రకటన బాగానే క్లిక్ అయింది.

ఇప్పుడు బాహుబలి2 పేరుతో విపరీతంగా సెర్చింగ్ జరుగుతుండడంతో.. అదే వీడియోను ఎవరో పేరు మార్చి ఫన్నీగా అప్ లోడ్ చేశారు. అక్కడి నుంచి ఇది విపరీతంగా షేర్ అయిపోతూ.. జనాలను తెగ నవ్వించేస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/