Begin typing your search above and press return to search.

మీడియాపై పోరాటం..మ‌న‌లో ఒక‌డు

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:20 AM GMT
మీడియాపై పోరాటం..మ‌న‌లో ఒక‌డు
X
ఇంత‌కుముందు ‘బ్రోక‌ర్’ సినిమాలో అవినీతి మీద పోరాటం చేశాడు ఆర్పీ ప‌ట్నాయ‌క్. ఆ సినిమా ఆడ‌కున్నా ఆర్పీకి మంచి పేరే తెచ్చింది. ఇప్పుడు మ‌రో కొత్త పోరాటంతో సినిమాకు శ్రీకారం చుట్టాడు ఆర్పీ. ఈసారి అత‌డి టార్గెట్ మీడియా కావ‌డం విశేషం. మీడియా పేరు చెప్పుకుని విర్ర‌వీగే.. వ్య‌వ‌స్థ‌ల్ని గుప్పెట్లో పెట్టుకుని ఆడించే వాళ్ల‌పై ఓ సామాన్యుడి పోరాటం నేప‌థ్యంలో ఆర్పీ తెర‌కెక్కించిన సినిమా ‘మ‌న‌లో ఒక‌డు’. ఆర్పీనే స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. లీడ్ రోల్ కూడా చేశాడు. మీడియాను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా టీజ‌ర్ ను మీడియా మొఘ‌ల్ అయిన రామోజీ రావుతోనే లాంచ్ చేయ‌డం ఇక్క‌డ పెద్ద ట్విస్టు.

రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీ ఛాంబ‌ర్లో టీజ‌ర్ లాంచ్ చేయించారు. మామూలుగా రామోజీ త‌మ సంస్థకు సంబంధించిన సినిమాల వేడుక‌ల్లో క‌నిపించ‌డ‌మే అరుదు. ఇక బ‌య‌టి సినిమాల సంగ‌తి చెప్పాల్సిన ప‌ని లేదు. బ‌హుశా ఆయ‌న రిలీజ్ చేసిన తొలి బ‌య‌టి సినిమా టీజ‌ర్ ఇదే కావ‌చ్చు. ఈ సినిమాలో విల‌న్ పాత్ర పోషించిన సాయికుమార్ కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. మ‌రి మీడియాను టార్గెట్ చేస్తున్న‌ట్లుగా క‌నిపించిన టీజ‌ర్ చూసి రామోజీ ఎలా స్పందించాడో మ‌రి. ఏదేమైనా ద‌ర్శ‌కుడిగా హిట్టు కొట్టాల‌ని ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నిస్తున్న ఆర్పీ.. మీడియా మొఘ‌ల్ ఆశీస్సుల‌తో అయినా హిట్టు కొడ‌తాడేమో చూద్దాం.