Begin typing your search above and press return to search.

క్లీన్‌ స్వీప్‌ కు కంగ్రాట్స్‌ : చరణ్‌

By:  Tupaki Desk   |   12 Dec 2018 11:05 AM GMT
క్లీన్‌ స్వీప్‌ కు కంగ్రాట్స్‌ : చరణ్‌
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సినీ వర్గాల నుండి పలువురు స్టార్‌ హీరోలు మరియు ప్రముఖులు కేసీఆర్‌ మరియు కేటీఆర్‌ లకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణలో రెండవ సారి అధికారంలోకి వచ్చినందుకు కేటీఆర్‌ మరియు కేసీఆర్‌ లను సినీ వర్గాల వారు అభినందనల్లో ముంచెత్తారు. చరణ్‌ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయం పట్ల స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఫేస్‌ బుక్‌ లో రామ్‌ చరణ్‌ తాను గతంలో కేటీఆర్‌ తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసినందుకు కేటీఆర్‌- కేసీఆర్‌- హరీష్‌ రావు- కవిత గార్లకు శుభాకాంక్షలు. మరోసారి మీ హయాంలో తెలంగాణ మరింతగా అభివృద్ది చెందాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్‌ చేశాడు.

టీఆర్‌ఎస్‌ విజయంకు మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ కూడా ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి మరీ శుభాకాంక్షలు తెపడం జరిగింది. ప్రెస్‌ మీట్‌ లో మా సభ్యులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పరిపాలనలో తెలంగాణ మరింతగా అభివృద్ది చెందుతుందనే నమ్మకంను వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ అభివృద్దికి కూడా కేసీఆర్‌ గారి ప్రభుత్వం అండదండలను అందిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశారు.