Begin typing your search above and press return to search.
ఆ అవార్డుతో చరణ్ ఫుల్ ఖుషీ
By: Tupaki Desk | 15 Dec 2015 5:51 PM ISTఏ నటుడికైనా అవార్డులనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే అవి ఇన్సిపిరేషన్ ఇస్తాయి. ఇంకా ఎక్కువగా కష్టపడటానికి అవే దోహదపడేది. ఏ అవార్డు రాకపోతే వారికి బెటర్ ఫెర్ఫామెన్స్ అంటే ఏంటో కూడా తెలియకుండా పోతుంది. అందుకే ప్రఖ్యాత కమల్ హాసన్ - ప్రకాష్ రాజ్ అండ్ చిరంజీవి కూడా అవార్డులు అనేవి ముఖ్యం అని చెబుతుంటారు. అయితే అక్కడక్కడా అమీర్ ఖాన్ వంటి మనుషులు కూడా ఉంటారులే. వారు అవార్డులపై పెద్దగా ఫోకస్ చేయరు.
కట్ చేస్తే.. ఇటీవలే రిట్జ్ పత్రిక ఇటీవల మెగా హీరో రామ్చరణ్కు ‘మోస్ట్ అడ్మైర్డ్ సెలబ్రిటీ ఐకాన్ ఆఫ్ ది ఇయర్-2015’ అవార్డు ప్రదానం చేసింది. ఈ పురస్కారం దక్కడం తనకెంతో ఆనందం కలిగించిందని అంటున్నాడు రామ్ చరణ్. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ... చాలా హ్యాపీగా కూడా ఫీలయ్యాడు. అయితే కళలు - రాజకీయాలు - వ్యాపారాల్లో రాణించిన వ్యక్తులకు రిట్జ్ ప్రధానం చేసిన ఈ అవార్డును చరణ్ అంత ప్రెస్టీజియస్ గా చెప్పుకోవడం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు.
ఇకపోతే సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం తని ఒరువన్ రీమేక్ పైనే ఫోకస్ చేశాడు. కాని సినిమా షూటింగ్ డిసెంబర్ 16న మొదలవుతుంది అనే రూమర్ తప్పించి.. అసలు ఈ ప్రాజెక్టు గురించి ఏం జరగుతుందో ఎవరికైనా తెలిస్తే ఒట్టు.