మూడవ సారి తల్లి అయ్యింది

Tue Sep 25 2018 16:35:33 GMT+0530 (IST)

1990లలో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన హీరోయిన్ రంభ. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో అప్పట్లో నటించిన రంభ తెలుగు సినిమా పరిశ్రమపై తనదైన ముద్ర వేయడం జరిగింది. సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత రంభ బిజినెస్ మెన్ ఇంద్రకుమార్ ను 2010లో వివాహం చేసుకుంది. వీరికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజాగా మరోసారి రంభ తల్లి అయ్యింది. మూడవ బిడ్డకు రంభ జన్మనిచ్చింది అంటూ ఆమె భర్త ఇంద్రకుమార్ సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు.మ్యాజిక్ వూడ్స్ సీఈఓ అయిన ఇంద్రకుమార్ టొరంటోలో ఉంటున్నాడు. రంభ తన మొదటి ఇద్దరు పిల్లలకు టొరంటోలో జన్మనిచ్చింది. మొదటి సంతానం లాన్యకు 8 సంవత్సరాలు కాగా - రెండవ సంతానం సాషకు 4 సంవత్సరాలు. తాజాగా రంభ బాబుకు జన్మనిచ్చినట్లుగా ఇంద్ర కుమార్ పోస్ట్ చేశాడు.

సెప్టెంబర్ 23న టొరంటో స్థానిక సమయం ప్రకారం రాత్రి సమయంలో రంభ బాబుకు జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది. తన భార్య రంభ తమ ఫ్యామిలీలోకి కొత్త మెంబర్‌ను తీసుకు వచ్చింది ఇది చాలా సంతోషకరమైన సమయం అంటూ ఇద్రకుమార్ పోస్ట్ చేశాడు.