మళ్ళి తల్లవుతున్న అభిబీ బేబీ

Wed May 23 2018 13:38:33 GMT+0530 (IST)

పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైనా హీరోయిన్ రంభ అంటే వెంటనే తెలుగు సినిమా ప్రేమికులకు గుర్తొచ్చేది చిరంజీవి హిట్లర్ సినిమాలో అభిభి పాటనే. చిరుకి ధీటుగా అందులో రంభ వేసిన స్టెప్స్ అప్పట్లో థియేటర్లో విపరీతమైన విజిల్స్ వేయించాయి. స్టార్ హీరోయిన్ గా కెరీర్ ని చాలా కాలం ఎంజాయ్ చేసిన రంభ అప్పుడున్న అగ్ర హీరోలందరితోనూ నటించడమే కాదు బ్రహ్మాండమైన హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అప్పట్లో తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఒక సాంగ్ తన పేరు మీదే స్పెషల్ గా రాయించి మరీ ఇద్దరి మీద షూట్ చేసారు. నాగలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కూడా స్టెప్స్ వేయటం రంభకే చెల్లింది. ఆ  తర్వాత మెల్లగా అవకాశాలు తగ్గుతున్న క్రమంలో సరైన సమయంలో వ్యాపారవేత్త ఇంద్రన్ పద్మనాభన్ ను పెళ్లి చేసుకుని ఫామిలీ లైఫ్ కి అంకితం అయ్యాక లాన్య-సాషా అనే ఇద్దరు పిల్లలకు తల్లయింది.తాజా  విశేషం ఏంటంటే రంభ మరోసారి గర్భం దాల్చింది. స్వయంగా కడుపుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న రంభ మూడో సారి తల్లవుతున్నందుకు చాలా గర్వంగా ఉందని ఇలా మీ అందరితో సంతోషాన్ని పంచుకోవడం ఆనందంగా ఉందని అందులో పోస్ట్ చేసింది. మొత్తానికి ముగ్గురు పిల్లల తల్లిగా రంభ కుటుంబం హ్యాపీగా ఉంది. అభిమానులు కూడా తనను విషెస్ తో ముంచెత్తుతున్నారు. అందాల తార దివ్య భారతికి డూప్ గా తొలిముద్దుతో  పరిచయమైన రంభ తక్కువ టైంలోనే స్టార్ గా ఎదిగిన తీరు ఆ టైం లో ఉన్న యువకులు ఇప్పటికీ మర్చిపోలేదు. మరి తమ అభిమాన తార మరోసారి గర్భం దాల్చింది అంటే వాళ్లకు కూడా గుడ్ న్యూస్ కదా