Begin typing your search above and press return to search.

వ‌ర్మ‌కు హ్యాపీ న్యూస్ వ‌చ్చింది బాస్

By:  Tupaki Desk   |   23 Feb 2018 5:38 AM GMT
వ‌ర్మ‌కు హ్యాపీ న్యూస్ వ‌చ్చింది బాస్
X
ఏ ముహుర్తంలో మొద‌లైందో కానీ వ‌ర్మ జీఎస్టీ.. ఆయ‌న‌కు చుక్క‌లు చూపించింద‌ని చెప్పాలి. వివాదాలు వ‌ర్మ‌కు కొత్త కాదు. కానీ.. ఏ వివాదంలోనూ ఆయ‌న బ్యాలెన్స్ మిస్ అయ్యింది లేదు. డిఫెన్స్ లో ప‌డింది లేదు. అందుకే ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న నోటి నుంచి సారీ అన్న‌ది విన్న‌ది లేదు.

అలాంటి వ‌ర్మ జీఎస్టీ ఎపిసోడ్ లో సారీ చెప్పాల్సి వ‌చ్చింది. కేసులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి వ‌చ్చింది. ఇలా చాలానే ఇష్యూలు వ‌ర్మ‌కు జీఎస్టీ మూవీకి సంబంధించిన వివాదంలో ఎదుర‌య్యాయి. మొన్న‌టికి మొన్న జీఎస్టీ మూవీకి సంబంధించిన ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు త‌మ ఎదుట హాజ‌రు కావాల‌ని ఆదేశాలు జారీ చేయ‌గా.. సీసీఎస్ కు వ‌చ్చిన ఆయ‌న దాదాపు మూడు గంట‌ల ఇర‌వై నిమిషాల పాటు ఉండిపోయారు. ఈ సంద‌ర్భంగా అధికారులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు.

విచార‌ణ‌లో భాగంగా వ‌ర్మ ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త‌ద‌నంత‌ర విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని చెప్ప‌గా.. వ‌ర్మ ఓకే చెప్పారు. షెడ్యూల్ ప్రకారం ఈ వారం ఆరంభంలో విచార‌ణ‌కు వ‌ర్మ హాజ‌రు కావాల్సి ఉంది. కానీ.. షూటింగ్ లో భాగంగా రాలేక‌పోయిన‌ట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. తాజాగా వ‌ర్మ‌కు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు ఫోన్ చేశారు. మార్చి మొద‌టి వారంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంటుంద‌న్న స‌మాచారం ఇచ్చారు.

వ‌ర్మ ల్యాప్ టాప్ ను తీసుకున్న అధికారులు.. దాన్ని ఎఫ్ ఎస్ ఎల్ కు పంపారు. అక్క‌డ నుంచి రిపోర్ట్ రాక‌పోవ‌టంతో ప్ర‌స్తుతం విచారించాల్సిన ఉన్నా.. దాన్ని వాయిదా వేశారు. రిపోర్ట్ వ‌చ్చాక‌.. అందులో పేర్కొన్న స‌మాచారం ఆధారంగా వ‌ర్మ‌ను అధికారులు విచారించ‌నున్నారు. కాలం కొన్ని విష‌యాల్ని పాత చేస్తాయంటారు. నిత్యం జీఎస్టీ త‌ల‌పోటుతో ఉన్న వ‌ర్మ‌కు..అధికారుల నుంచి వ‌చ్చిన ఫోన్ కాల్ ఎంతోకొంత ఊర‌ట ల‌భించి ఉంటుంద‌న్న‌ది ఖాయం.