Begin typing your search above and press return to search.

ఆ సీఎం గురించి బాంబు పేల్చిన వర్మ

By:  Tupaki Desk   |   11 July 2018 6:00 AM GMT
ఆ సీఎం గురించి బాంబు పేల్చిన వర్మ
X
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నది ఫేమస్ డైలాగ్. కానీ ఇది తనకు ఓ సంఘటన ద్వారా నిరూపితమైందని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఓ సీఎం స్థాయి వ్యక్తి కూడా చట్టాల్లోని నిబంధనలను మార్చలేకపోయాడని.. ఓ కమిషనర్ ను ప్రభావితం చేయలేకపోయాడని సంచలన నిజాలు బయటపెట్టాడు..

ఈ సందర్భంగా వర్మ మహారాష్ట్ర లోని ముంబైలో ఓ భూమి విషయంలో తగువు పడ్డ ఇద్దరు బడా పారిశ్రామికవేత్తల మధ్య వివాదాన్ని ఓ పోలీస్ అధికారి ఎలా పరిష్కరించాడో వివరించాడు. ‘మహారాష్ట్ర సీఎం తను సన్నిహితుడైన బడా పారిశ్రామిక వేత్తకు ఎదుర్కొంటున్న భూ సమస్యను పరిష్కరించాలని హోంశాఖ మంత్రి ద్వారా పోలీసులకు ఆదేశాలిచ్చాడు. హోంశాఖ సెక్రెటరీ స్వయంగా అప్పటి మహారాష్ట్ర ఎకనామిక్ చీఫ్ ఆఫ్ క్రైం బ్యాచ్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్న సదానంద్ దాతేకు ఈ పని అప్పగించారు. ఆ భూమి విషయంలో మెలిక పెట్టిన ప్రత్యర్థి పారిశ్రిమికవేత్తను అరెస్ట్ చేయాలని ఆదేశించారు’.. కానీ సదానంద్ దాతే ఆ పని చేయలేదు. ఇది లీగల్ గా చెల్లదని.. సివిల్ కేసుల్లో పోలీసులు తలదూర్చితే అభాసుపాలవుతామని స్పష్టం చేశాడు.

అరెస్ట్ చేయమంటే చేయకపోయే సరికి డైరెక్ట్ గా సీఎం లైన్లోకి వచ్చేసి సదానంద్ దాతేను తన చాంబర్ కు పిలిపించాడు. అప్పుడు కేసు పూర్వపరాలు.. అరెస్ట్ చేస్తే జరిగే పరిణామాలను సీఎంకు వివరించాడట.. దీంతో సీఎం రియలైజ్ అయ్యి చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. ఇందులో ఇన్ వాల్వ్ కాము అని తన సన్నిహితుడైన పారిశ్రామిక వేత్తకు సూచించాడట.. ఈ విషయాలను వర్మ స్వయంగా చెప్పి సంచలనం సృష్టించారు.. ‘దేశంలో చట్టం ఎంత బలంగా ఉందో ఈ ఒక్క ఉదాహరణ చాలు.. మనమీద ఏ కేసునైనా.. పరిష్కరించుకోగలిగే స్థైర్యాన్ని చట్టాలు కల్పించాయి’ అని వర్మ వివరించారు.