పవన్ కు మళ్లీ వర్మ పంచ్

Sat Apr 21 2018 22:35:22 GMT+0530 (IST)

నిను వదలని నీడను నేనే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ మీద విమర్శల దాడిని కొనసాగిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. శ్రీరెడ్డితో పవన్ ను బూతు తిట్టించిన ఎపిసోడ్ లో వర్మ బాగా డిఫెన్సులో పడ్డ నేపథ్యంలో కొంచెం తగ్గుతాడని అంతా అనుకున్నారు. కానీ ఒక్క రోజు మాత్రమే కొంచెం శాంతం పాటించి.. తర్వాత పవన్ మీద దాడిని కొనసాగిస్తున్నాడు వర్మ. నిన్న పవన్ చాలా ఆవేశంగా పెట్టిన ఒక ట్వీట్ కు వర్మ ఈ రోజు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తెలుగు ఛానెళ్లకు ప్రత్యేక హోదా కంటే వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయడం మీదే దృష్టి ఎక్కువని.. మరి మీడియాను మేనేజ్ చేసే మీ ప్రయారిటీ ఏంటని చంద్రబాబునుద్దేశించి ప్రశ్నించాడు పవన్.దీనికి బదులుగా వర్మ స్పందిస్తూ.. ‘‘నమ్మలేని షాక్ కాస్టింగ్ కౌచ్ బాధితులని - వాకాడ అప్పారావ్ లాంటి మగాళ్ల దౌర్జన్యాలాలకి గురయిన అమ్మాయిలని - పవన్ కళ్యాణ్ వాళ్లంతా వ్యభిచారిణులు అంటే - మహిళా సంఘాలు ఏ మాత్రం స్పందించకపోవడం? శ్రీరెడ్డి కోపంలో తిట్టు ఎక్కువా? పవన్ కి ఆ అమ్మాయిల పైన ఇంత హేవభావం ఎక్కువా?’’ అని ట్వీట్ చేశాడు. ఐతే పవన్ ట్వీట్ ఎంత గందరగోళంగా ఉందో.. వర్మ ట్వీట్ కూడా అదే తరహాలో ఉందన్నది వాస్తవం. మరోవైపు నిన్న ఫిలిం ఛాంబర్ దగ్గరికి పవన్ వచ్చినపుడు ఏబీఎన్ ఛానెల్ ఓబీ వ్యాన్ ను ధ్వంసం చేసిన పవన్ అభిమానుల్ని పోలీసులు అరెస్టు చేశారని.. వారిని పవన్ కాపాడాలని మహేష్ కత్తి ట్వీట్ చేయగా.. దానికి వర్మ మద్దతు పలికాడు. ఫిలిం ఛాంబర్ దగ్గరికి వచ్చినట్లే మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అక్కడి వెళ్లాలని వర్మ డిమాండ్ చేశాడు.