Begin typing your search above and press return to search.

కామెంట్‌: ఏ ఎండకు ఆ గొడుగు

By:  Tupaki Desk   |   12 Feb 2016 11:30 AM GMT
కామెంట్‌: ఏ ఎండకు ఆ గొడుగు
X
సంచలన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు పేరుంది. దాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని రకాలుగానూ ట్రై చేస్తుంటాడు. అన్ని రకాలుగా అంటే పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు. తనకు ఏ ఆలోచన వస్తే దాన్ని ట్వీట్ చేసేయడం, నోటికి ఏదొస్తే అనేయడం అంతే. అదేమంటే నా ఇష్టం అంటాడు కానీ.. వర్మ చేసే ప్రతీ పనికీ ఓ స్ట్రాటజీ ఉంటుందనే విషయం సాధారణంగా లేట్ గా అర్ధమవుతుంది.

వర్మ రీసెంట్ మూవీస్ ని పరిశీలిస్తే ఓ విషయం అర్ధమవుతుంది. ఈ డైరెక్టర్ చాలానే సినిమాలు తీసేస్తుంటాడు కానీ.. టెక్నికల్ గా కాస్త గుర్తుండే సినిమాల వరకే తీసుకుందాం. మూడేళ్ల క్రితం అంటే 2013లో ది ఎటాక్స్ ఆఫ్ 26/11 అంటూ ఓ మూవీ రిలీజ్ చేశాడీయన. ముంబై దాడుల నేపథ్యాన్ని పాయింట్ గా తీసుకుని.. బాలీవుడ్ లో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆ తర్వాత 2014లో మరీ లోబడ్జెట్ తో మూవీస్ చేయడంతో, తన స్థాయిని తానే తగ్గించుకున్నాడనే విమర్శలు చుట్టుముట్టాయి. అందుకే మళ్లీ జాగ్రత్త పడి.. గతేడాది కిల్లింగ్ వీరప్పన్ తీసుకొచ్చాడు.

కిల్లింగ్ వీరప్పన్ చిత్రం అంతా కర్నాటకకు సంబంధించిన స్టోరీ. అందుకనే కన్నడలో సినిమా చేసేశాడు. వర్మ ఇప్పుడు తెలుగులో వంగవీటి సినిమా తీసేస్తూ.. తెలుగులో నా ఆఖరి సినిమా అంటూ తెగ ఊదరగొట్టేస్తున్నాడు. ఇది బెజవాడ రౌడీయిజంపై తీస్తున్న సినిమా. వర్మ సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్నా.. కేవలం ఆయా ప్రాంతాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనలనే సినిమాలుగా తీసుకుంటున్నాడు. అఫ్ కోర్స్.. గతంలో వచ్చిన రక్తచరిత్ర కూడా ఈ కోవలోదే. మరి ఇలా తీసుకుంటూ పోతే.. ఏరియాకి ఓ గొడవ, సమస్య ఉంటూనే ఉంటాయి. వాటిని పట్టుకుని అక్కడికక్కడ సినిమాలు చేసుకుంటాడన్న మాట.