Begin typing your search above and press return to search.

అసలు రిలీజ్‌ అవుతుందా? అవ్వదా?

By:  Tupaki Desk   |   11 Feb 2016 4:20 AM GMT
అసలు రిలీజ్‌ అవుతుందా? అవ్వదా?
X
బెజవాడ రౌడీయిజంలో వంగవీటి రాధా, వంగవీటి రంగాల పాత్రలను తెరకెక్కిస్తూ.. వంగవీటి అనే సినిమాని స్టార్ట్ చేశాడు వర్మ. రంగా అభిమానుల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ పబ్లిసిటీ బాగానే చేసిన వర్మ.. ఇప్పుడు ఆ మూవీలో ఎవరెవరి పాత్రలు ఉంటాయో రివీల్ చేశాడు.

చలసాని వెంకటరత్నంను వంగవీటి రాధా చంపడంతో మొదలైన విజయవాడ రౌడీయిజం.. వంగవీటి రంగా హత్య వరకూ కొనసాగుతుందన్నాడు వర్మ. సినిమా స్టోరీ లైన్ కూడా ఇదే అని చెప్పడమే కాదు.. ఇందులో పాత్రలుగా ఎవరెవరు ఉంటారో వెల్లడించాడు. ఈ సినిమాలోని ముఖ్య పాత్రలుగా వంగవీటి రాధా - వంగవీటి రంగా - వంగవీటి రత్నకుమారి - దేవినేని నెహ్రూ - దేవినేని గాంధీ - దేవినేని మురళి - కర్నాటి రామ్మోహన్ రావు - సిరీస్ రాజు - రాజీవ్ గాంధీ - దాసరి నారాయణ రావు - ముద్రగడ పద్మనాభం - నందమూరి తారక రామారావులు.. వంగవీటి మూవీలో మెయిన్ కేరక్టర్స్ అని చెప్పాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఈ పాత్రలను నేరుగా అవే పేర్లతో షూట్‌ చూస్తే.. అసలు సినిమా ధియేటర్లకు వస్తుందా? వీళ్లలో ఎవరు కోర్టులో కేసు వేసినా.. సెన్సార్‌ బోర్డుకు లెటర్‌ రాసినా.. అసలు సినిమాయే రిలీజ్‌ అవదు.

కాకపోతే వర్మ గతంలో ముంబయ్‌ వరకూ వెళ్లి సెన్సార్‌ బోర్డ్‌, రివైజింగ్‌ కమిటీ.. ఇలా చాలామందితో పోరాడి గోవిందా గోవిందా వంటి సినిమాలకు సెన్సార్‌ క్లియరెన్స్‌ తెచ్చుకుని రిలీజ్‌ చేశాడు. కాని ఈ ''వంగవీటి'' విషయంలో అది జరుగుతుందా? ఎందుకంటే ఈ సినిమా క్యారెక్టర్లతో అసోసియేట్‌ అయిన రాజకీయ నాయకులూ.. రాజకీయ పార్టీలు ఇప్పుడు పవర్‌ లో ఉన్నాయి. పైగా స్వయంగా రంగా తనయుడే 'నో' అంటున్నాడు.

కత్తులు, బరిసెలు, అంబాసిడర్ కార్లు తప్ప.. సెల్ ఫోన్ లు, గన్నులు లేని 30 ఏళ్ల క్రితం రోజుల్లో విజయవాడలో ఉన్న పరిస్థితులను కళ్లకు కట్టేట్టుగా చూపనున్నట్లు చెప్పాడు మన వివాదాస్పద డైరెక్టర్. తెలుగులో ఇదే తన ఆఖరి సినిమా అన్నాడు కూడా. మరి రిలీజ్‌ అయ్యే ఆఖరి సినిమా అవుతుందో.. రిలీజ్‌ అవ్వని ఆఖరి సినిమా అవుతుందో చూద్దాం