Begin typing your search above and press return to search.

మనకు బాధేస్తే.. ఆయనకు సినిమా కథ

By:  Tupaki Desk   |   29 Aug 2015 4:45 AM GMT
మనకు బాధేస్తే.. ఆయనకు సినిమా కథ
X
ఇప్పటికే స్టార్‌ ఇండియా మాజీ సిఇఓ పీటర్‌ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి, అలాగే ఆమెచే హత్యగావించబడిన ఆమె చెల్లెలు ఎలియాస్‌ కూతురు షీని బోరా.. ఈ ఎపిసోడ్‌ గురించి చాలానే చెప్పకున్నాం. మన పొలిటికల్‌ కాలమ్న్‌ లో ఎన్నో సమగ్ర నివేదికలు, ఎనాలసిస్‌ లూ మీరూ చదివే ఉంటారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఒక సామాన్యుడికి కనిపించే అంశం ఏంటి? ఖచ్చితంగా ఇదొక పరువు హత్య, ఇంతగా చదువుకున్న వారు కూడా ఈ రోజుల్లో ఇలాంటి హత్యలు చేస్తారా అంటూ సొసైటీకి ఒక రకమైన హేయమైన ఫీలింగ్‌ వచ్చేసింది. కాని ఇదంతా సొసైటీ ఎత్తు.. బట్‌ డైరక్టర్‌ రామ్‌ గోపాల్‌ వర్మకు ఏమనిపించింది?

ఎస్‌.. మీరు ఊహించింది కరక్టే.. అందరూ ఊహించినట్లే మనోడికి ఇందులో కూడా ఒక సినిమా కనపించేసింది. కథలో మర్డర్‌ ఉంది, కథనంలో ట్విస్టులున్నాయ్‌.. ఇక రైటర్‌ తో డైలాగులు రాయించుకుంటే చాలు.. ఒక హేట్‌ స్టోరీ, ఒక రక్త చరిత్ర టైపులో మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లైనా ఇలాంటి మర్డర్‌ మిస్టరీలను ఉత్సాహంగా తెరకెక్కిస్తాడు వర్మ. అందుకే ఇప్పుడు ఈ సినిమాపైన కన్నేశాడు. అయితే ఇంతటి మొనగాడు అయ్యుండి కూడా... ఈ సినిమాను థ్రిల్లర్‌ అనాలా లేకపోతే ఒక ఫ్యామిలీ స్టోరీ అనాలా అనే కన్ఫ్యూజన్‌ లో ఉన్నాడట గురుడు. అదేంటి సార్‌.. మీ క్రియేటివిటీ చూసి జనాలు అవాక్కవుతారు కాని, ఏకంగా ఒక కథను చూసి మీరు కూడా అవాక్కవుతారా? ఇదేదో కొత్త ట్విస్టులా ఉందే.. ముందు దీనిపై ఒక సినిమా తీస్తే బెటర్‌. లేకపోతే, జనాలకు అయ్యో పాపం అనిపిస్తుంటే మీకు అది సినిమా కథైపోయిందా? మరీ టూ మచ్‌ మ్యాస్టారూ!!!