Begin typing your search above and press return to search.

సల్మాన్ కి సలహాలిస్తున్న బ్రూస్ లీ

By:  Tupaki Desk   |   10 Oct 2015 3:30 AM GMT
సల్మాన్ కి సలహాలిస్తున్న బ్రూస్ లీ
X

సినిమా సెలక్షన్ లో సల్మాన్ ఖాన్ ది డిఫరెంట్ స్టయిల్. సబ్జెక్ట్ తనకి నచ్చిందా లేదా అనేకంటే.. ఫ్యాన్స్ కి ఎక్కుతుందా లేదా అనే విషయానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు బాలీవుడ్ కండలవీరుడు. అలాంటిది ఇప్పుడు సినిమా సెలక్షన్ కోసం మెగా పవర్ స్టార్ సలహాలు తీసుకుంటున్నాడట. తూచా తప్పకుండా పాటించేస్తున్నాడట కూడా.

ముఖ్యంగా సౌత్ రీమేక్ ల విషయంలో సల్మాన్ కి సలహాలిస్తున్నాడు చెర్రీ. రీసెంట్ గా తమిళ్ లో హిట్ అయిన తని ఒరువన్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చరణ్. ఈ సబ్జెక్ట్ కి హిందీలో సల్మాన్ కి సరిగా సరిపోతుందని చెప్పి ఒప్పించాడట. అంతే కాదు.. తండ్రి చిరంజీవితో చేయబోతున్న కత్తిని కూడా.. హిందీలో రీమేక్ చేయాల్సిందిగా సూచించాడట చరణ్. నిజానికి ఇక్కడి సినిమాలను అనేకమంది లాంగ్వేజ్‌ తెలిసిన ఇంటర్‌ ప్రెటర్ల సాయంతో సల్మాన్‌ చూస్తాడని ఓ టాక్‌ ఉంది. ఎందుకంటే మనోళ్ళు సబ్‌ టైటిల్సు వంటివి వేయించి మన సినిమాలను హిందీలో రిలీజ్‌ చేయరు కాబట్టి.. మరి చరణ్‌ స్వయంగా చూసి చెబుతున్నాడంటే.. సల్మాన్‌ కు ఆ బాధ అక్కర్లేదు. సలహా పక్కాగానే ఉంటుంది.

సల్మాన్ - చరణ్ ల మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంది. అక్కడ జంజీర్ విషయంలో సల్మాన్ చాలా హెల్ప్ చేశాడు. ముంబైలో చరణ్ ఇల్లు కొనుక్కోవడంలోనూ సల్లూభాయ్ దే సెలక్షన్. అంతే కాదు.. రీసెంట్ గా మెగాబర్త్ డే బాష్ కు కూడా అటెండయ్యాడు సల్మాన్. మెగా ఫ్యామిలీతో ఉన్న ఈ ర్యాపోనే.. ఇప్పుడు సినిమా స్టోరీల ఎంపిక వరకూ చేర్చిందన్నది ఇండస్ట్రీ టాక్.