Begin typing your search above and press return to search.

చరణ్‌ ఇంప్రూవ్‌ అయితేనే ఇంప్రెషన్‌

By:  Tupaki Desk   |   31 Aug 2015 7:37 AM GMT
చరణ్‌ ఇంప్రూవ్‌ అయితేనే ఇంప్రెషన్‌
X
మెగాస్టార్‌ చిరంజీవితో ఏ మెగా హీరోకి పోలికే లేదు. చిరు కెరీర్‌ ఆరంభమే ఇటు కమర్షియల్‌ సినిమాలు, అటు ప్రయోగాలు రెండూ చేసి సక్సెస్‌ సాధించాడు. ఎక్స్‌ ప్రెషన్‌, డ్యాన్స్‌, నటన ఇలా ప్రతిదాంట్లో.. ఇన్నోవేషన్‌ కనిపించేవి. 90లలో గ్యాంగ్‌ లీడర్‌ లో నటించేప్పటికి చిరు పూర్తి పరిణతి ఉన్న హీరో. ఆ సినిమా ఓ అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన అన్నను దుర్మార్గులు అంతమొందించినప్పుడు తమ్ముడిలో ఆవేశం ఎలా కట్టలు తెంచుకుంటుంది? శత్రువుల్ని ఢీకొట్టేటప్పుడు హీరోయిజం ఎలా ఉండాలి? అనేదానికి గ్యాంగ్‌ లీడర్‌ లో చిరు నటన పరాకాష్ట.

ఇప్పుడు చరణ్‌ కి ఆ టైమ్‌ వచ్చింది. ఇంతకాలంగా చరణ్‌ ఆడుతున్నది కేవలం సేఫ్‌ గేమ్‌ మాత్రమే. అతడు తండ్రిని అనుసరించి ఇన్నోవేటివ్‌ గా ముందుకు సాగాల్సిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రూస్లీ చిత్రంలో గ్యాంగ్‌ లీడర్‌ క్యారెక్టరైజేషన్‌ కనిపిస్తుందంటూ గోపిమోహన్‌ చెప్పాడు. అప్పట్నుంచి మెగా ఫ్యాన్స్‌ లో అంచనాలు రెట్టింపయ్యాయి. వాటిని రీచ్‌ అయ్యేలా ఎక్స్‌ ప్రెషన్‌ లో పెర్ఫెక్షన్‌, క్లారిటీ చాలా ఇంపార్టెంట్‌. చిరు కంటే నాలుగు వక్కలు ఎక్కువే తిన్నాడే అని అభిమానుల్లో డిష్కసన్‌ రావాలి. అప్పుడు మాత్రమే చెర్రీకి మంచి మార్కులు పడతాయి. మాస్‌ ని టచ్‌ చేయాలి. క్లాస్‌ ని మెప్పించాలి. చిరు బాడీ లాంగ్వేజ్‌ ని రిజెంబుల్‌ చేయకుండా తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని చూపించాలి. డ్యాన్సుల్లో మెరుపులు మెరిపించాలి. నిజంగా ఇది చరణ్‌ కి ఓ సవాల్‌. ఏం చేస్తాడో వెయిట్‌ అండ్‌ సీ.