Begin typing your search above and press return to search.

నాన్న సినిమాలో నేనో ఐటెమ్‌ -చరణ్‌

By:  Tupaki Desk   |   26 Aug 2015 4:54 AM GMT
నాన్న సినిమాలో నేనో ఐటెమ్‌ -చరణ్‌
X
మెగా ఫ్యామిలీ హీరోలంతా మెగాస్టార్‌ 150వ సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నకు సమాధానం చరణ్‌ చెబితే ఎలా ఉంటుంది? వినాలని ఉందా? అయితే వినండి. ఐడియా బావుంది. నాన్నగారి సినిమాలో ఒకవేళ నటించాల్సొస్తే నేనో ఐటెమ్‌ నంబర్‌ ని మాత్రమే. ఇందులో కేవలం డాడ్‌ మాత్రమే నటిస్తారు. నేను డ్యాన్స్‌ చేస్తానంతే. ఒకవేళ మెగా ఫ్యామిలీ హీరోలంతా ఈ చిత్రంలో నటించాల్సొస్తే... పవన్‌ బాబాయ్‌, నేను, బన్ని, సాయిధరమ్‌ అందరూ ఐటెమ్‌ లే అంటూ ఛమత్కరించాడు చరణ్‌.

మెగాస్టార్‌ సినిమాలో మెగాస్టార్‌ మాత్రమే హీరో. మిగతావాళ్లంతా ఐటెమ్‌ లే అనేది తండ్రి గురించిన చెర్రీ అభిప్రాయం. డాడ్‌ అంటే చెర్రీకి ఎంత ప్రేమో ఇప్పుడర్థమైంది కదూ? అసలు ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది గురూ? అన్న ప్రశ్నకు.. ఈ సంవత్సరమే మొదలవుతుంది. 2016 వేసవినాటికి రిలీజ్‌ చేయాలన్నది ప్లాన్‌.

ఒకసారి స్క్రిప్టు ఫైనల్‌ అయిపోతే ఇక సెట్స్‌ కెళ్లి కేవలం ఆరు నెలల్లో పూర్తి చేస్తాం. నలుగురు స్టార్‌ డైరెక్టర్లు మేం ఉన్నాం అంటే మేం ఉన్నాం అంటూ పోటీపడుతున్నారు. నాకు చాలా హ్యాపీ.. అని చెర్రీ తన మనసులోని మాటని చెప్పాడు. ఇప్పటికే 'కొణిదెల' పేరుతో లోగో రెడీ అవుతోంది. చిరంజీవికి ఇష్టమైన హనుమంతుని ఫోటో ఈ లోగోపై దర్శనమివ్వనుంది.