Begin typing your search above and press return to search.

చిరంజీవి టూ మహేష్‌ టూ చరణ్‌

By:  Tupaki Desk   |   3 May 2016 9:30 AM GMT
చిరంజీవి టూ మహేష్‌ టూ చరణ్‌
X
గతంలో వరుసగా కొన్ని సినిమాలు ఫ్లాపులు అయినప్పుడు.. సినిమా చేసేసి అది ఫ్లాపయ్యాక జనాలకు డబ్బులు తిరిగిచ్చే ప్రోగ్రామ్‌ లు పెట్టకుండా.. సినిమా చేసేటప్పుడే తన రెమ్యూనరేషన్‌ తగ్గించుకొని.. అందుకు ప్రతిగా నైజాం ఏరియా రైట్లు తీసుకోవడం మొదలెట్టారు మెగాస్టార్‌ చిరంజీవి. ఆ తరువాత ఏ హీరో కూడా అలాంటి స్టెప్‌ వేయలేదు.

కాని ఈ మధ్యన సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు.. వరుసగా ఓ రెండు భారీ ఫ్లాపులు రావడంతో.. వెంటనే తన రెమ్యూనరేషన్‌ తగ్గించుకుని.. శ్రీమంతుడు సినిమాతో ఏకంగా ప్రొడక్షన్‌ పార్టనర్‌ అయిపోయాడు. అంతేకాదు.. తానే స్వయంగా ప్రొడక్షన్‌ చూసుకుంటూ.. డిస్ర్టిబ్యూషన్‌ కూడా దగ్గరుండి చూసుకున్నాడు. చిరంజీవి తరువాత ఆ ప్రాసెస్‌ ను మహేష్‌ ఫాలో అయితే.. ఇప్పుడు వీరిని రామ్‌ చరణ్‌ ఫాలో అవుతున్నాడు. తని ఒరువన్ సినిమా కోసం అసలు మామ అల్లు అరవింద్‌ దగ్గర నుండి రూపాయి కూడా తీసుకోకుండా.. ప్రతీదీ గీతా ఆర్ట్స్‌ తరుపున తనే దగ్గరుండి చూసుకుంటున్నాడట. ఫైనల్‌ గా సినిమాను తక్కువ రేటుకు విక్రయించి.. లాభాల్లో షేర్‌ తీసుకుంటాడట. బ్రూస్‌ లీ వంటి ఫ్లాపులతో బెంబేలెత్తిపోయిన బయ్యర్లకు.. ఆ విధంగా కాస్త రిలీఫ్‌ ఇస్తాడట.

అసలు హీరోలందరూ ఇదే ప్యాట్రన్‌ ఫాలో అయితే.. ఏ సినిమా కూడా 20-25 కోట్ల బడ్జెట్‌ దాటదేమో. కాని సక్సెస్‌ మీద మన స్టార్‌ హీరోలకు పెద్దగా నమ్మకం తక్కువగా. అందుకే హ్యాపీగా తమ చెక్కు తాము తీసుకొని ఆ పాట్లేదో నిర్మాతకే వదిలేస్తున్నారు.