Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: హైప‌ర్ జోడీ భ‌లే భ‌లే

By:  Tupaki Desk   |   30 Aug 2016 3:48 PM GMT
ఫొటో స్టోరీ: హైప‌ర్  జోడీ భ‌లే భ‌లే
X
యువ క‌థానాయ‌కుడు రామ్ స్వ‌త‌హాగా త‌న స్టైల్‌ కి త‌గ్గ క‌థ‌లో - త‌న స్టైల్‌ కి త‌గ్గ పాత్ర‌ని చేస్తున్నాడు. ఎప్పుడూ తెర‌పై హైప‌ర్ యాక్టివ్‌ నెస్‌ తో సంద‌డి చేసే రామ్ - ప్ర‌స్తుతం సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో `హైప‌ర్‌` అనే సినిమా చేస్తున్నాడు. అందులో క‌థానాయికగా రాశిఖ‌న్నా న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకొంది. వ‌చ్చే సెప్టెంబ‌రులోనే చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్ర‌స్తుతం టైటిల్ సాంగ్‌ ని తెర‌కెక్కిస్తున్నారు. ఆ పాట‌లో ఉన్న‌ప్పుడే రాశిఖ‌న్నా సెల్‌ ఫోన్ ఇలా క్లిక్‌ మంది. రామ్‌ - రాశిఖ‌న్నా జోడీ ఎప్పుడూ సూప‌ర్బ్‌ గా ఉంటుంది. ఇక్క‌డ కూడా వీళ్ల‌ని చూస్తుంటే భ‌లే జోడీ అనిపించ‌డం లేదూ! అన్న‌ట్టు రాశిఖ‌న్నాకి ఇష్ట‌మైన అతి కొద్దిమంది క‌థానాయ‌కుల్లో రామ్ ఒక‌రట‌. అందుకే వీళ్ల మ‌ధ్య కెమిస్ట్రీ అదిరిపోతుంటుంద‌ని ఇండ‌స్ట్రీ జ‌నాలు చెబుతుంటారు.