Begin typing your search above and press return to search.

శైలజ కోసం తను డీజేగా మారాడు

By:  Tupaki Desk   |   30 Nov 2015 4:41 AM GMT
శైలజ కోసం తను డీజేగా మారాడు
X
ఎనర్జిటిక్ హీరో రామ్ ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నాడు. లవర్ బోయ్ గా తిరుగులేని ఇమేజ్ ఉన్న రామ్.. కొన్ని ప్రయోగాలతో తలబొప్పి కట్టించుకున్నాడు. అందుకే ఇప్పుడు "నేను శైలజ"మూవీలో రియల్ లైఫ్ లో కనిపించే సాధారణ పాత్రనే చేయబోతున్నాడు.

నేను శైలజలో రామ్ పాత్ర ఓ డీజే. అందుకే ఈ సినిమాలో మ్యూజిక్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండనుంది. ఫస్ట్ సాంగ్ ని నైట్ క్లబ్ లోనే చిత్రీకరించడం విశేషం. ఇక ఈ మూవీలో బ్రేకప్ సమయంలో వచ్చే శైలజ అంటూ సాగే టైటిల్ సాంగ్ తనకు చాలా ఇష్టమంటున్నాడు రామ్. సినిమాటిక్ కేరక్టర్లు, రియల్ లైఫ్ కేరక్టర్లను.. రెండింటినీ బేలన్స్ చేస్తూ.. కెరీర్ కంటిన్యూ చేస్తానని రామ్ అంటున్నాడు. శివం తర్వాత కేరక్టర్ పరంగా ఇంపార్టెన్స్ ని బాగానే తెలుసుకున్నానన్నది ఈ ఎనర్జీ హీరో వాదన. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన నేను శైలజ ఆడియో.. డిసెంబర్ రెండో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీలో హీరోయిన్ రోల్ కి హీరోతో సమానమైన ప్రాధాన్యత ఉంటుందని చెబ్తున్నాడు రామ్. పెర్ఫామెన్స్ కి ఇంపార్టన్స్ ఉన్న ఈ రోల్ ని కీర్తి సురేష్ అద్భుతంగా పోషించిందని అన్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేను శైలజ.. న్యూ ఇయర్ కానుకగా జనవరి 1, 2016 న రిలీజ్ కానుంది.