నేనే ముద్దులోద్దన్నాను : రామ్

Fri Oct 19 2018 17:00:01 GMT+0530 (IST)

ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమా హలో గురు ప్రేమ కోసమే నిన్న పండగ సందర్భంగా విడుదలై సెలవుల అడ్వాంటేజ్ ని బాగా వాడుకుని ఓపెనింగ్స్ పరంగా మంచి ఫిగర్స్ నే నమోదు చేసింది. ఇప్పటికి డివైడ్ టాక్ ఉన్నా ఫైనల్ స్టేటస్ ఏంటో తెలియాలంటే ఇంకో నాలుగైదు రోజులు ఆగాల్సిందే. ఇక దీని ప్రమోషన్ లో భాగంగా కొన్ని విషయాలు షేర్ చేసుకున్న రామ్ లిప్ లాక్ కిస్సుల ప్రస్తావన తెచ్చాడు. తాను ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కొందరు లిప్ కిస్ పెట్టమని అడిగారని కాని స్క్రిప్ట్ డిమాండ్ చేయనప్పుడు అనవసరంగా ఎందుకు ఇరికించాలనే ఉద్దేశంతో నో చెప్పినట్టు క్లారిటీ ఇచ్చాడుఅయితే సబ్జెక్టు డిమాండ్ చేస్తే భవిష్యత్తులో చేస్తానేమో కాని ఇప్పుడు మాత్రం దాని ప్రసక్తే లేదంటున్నాడు. హలో గురు ప్రేమ కోసమేలో లిప్ టు లిప్ అన్నంత దగ్గరగా ఒక సీన్ ఉంది కాని అది జస్ట్ అలా అనిపించి తప్పించడంతో ముగిసిపోతుంది. సో రామ్ కు ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు కిస్సింగ్ సీన్లు వచ్చాయి కాని కుర్రాడే నో చెబుతున్నాడన్న మాట. కెరీర్ ప్రారంభించి చాలా ఏళ్ళు అయినప్పటికీ రెడీ-నేను శైలజ లాంటి రెండు మూడు తప్ప సాలిడ్ బ్లాక్ బస్టర్స్ లేక ఇబ్బంది పడుతున్న రామ్ హలో గురు ప్రేమ కోసమే చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఇది పూర్తిగా నిలబడుతుందా లేదా చూడాలి.

ఒకే తరహా లవర్ బాయ్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు అనే కామెంట్ ఉన్న నేపధ్యంలో కొత్త వాటిని ట్రై చేస్తున్నానని రోజుకు ఆరు కథల దాకా వింటున్నానని చెప్పిన రామ్ కు వాటిలో ఏదీ ఒక పట్టాన నచ్చడం లేదట. సరే ట్రెండ్ కు తగ్గట్టు అప్ డేట్ అవుతూ లిప్ లాక్ ఓకే చేస్తాడా లేక పోటీ హీరోల్లా కొత్త తరహా కథల వైపు మొగ్గు చూపుతాడా కాలమే సమాధానం చెప్పాలి.