Begin typing your search above and press return to search.

రామ్.. ఆ డైరెక్టర్ తో ఎందుకు చెయ్యడు?

By:  Tupaki Desk   |   5 Oct 2015 3:30 PM GMT
రామ్.. ఆ డైరెక్టర్ తో ఎందుకు చెయ్యడు?
X
ఒక్కో హీరోకు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. యాక్టింగ్ లో ఒక స్టయిల్ ఉంటుంది. ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఫలానా టైపు క్యారెక్టర్లయితే ఆ హీరోకు బాగా సూటవ్వుతుందని.. ఫలానా డైరెక్టరయితే ఆ హీరోను బాగా చూపిస్తాడని జనాల్లో ఓ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్ లో సినిమా బాగా వర్కవుటవుతుంది కూడా. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కు రవితేజ - పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ లాంటి హీరోలతో భలేగా సెట్టవుతుంది. వాళ్ల స్టయిల్ - పూరి స్టయిల్ మిక్సయితే తెరమీద ఆ కెమిస్ట్రీనే వేరుగా ఉంటుంది.

ఐతే పూరి స్టయిల్ కు మ్యాచ్ అయ్యే ఇంకో హీరో టాలీవుడ్ లో ఉన్నాడు. అతనే రామ్. పవన్ కళ్యాణ్ - రవితేజల స్టయిల్ మిక్స్ చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ స్టయిల్ క్రియేట్ చేసుకున్నాడు రామ్. స్క్రీన్ మీద తనదైన శైలిలో యాటిట్యూడ్ చూపిస్తుంటాడు రామ్. అతడి కొత్త సినిమా ‘శివమ్’లోనూ ఆ యాటిట్యూడ్ కనిపిస్తుంది. లైటర్ కోసం ఫైట్ చేసే సీన్ లో.. గోవాలో ఓ ఫైట్ సీన్ లో రామ్ స్పెషాలిటీ కనిపిస్తుంది. ఈ సన్నివేశాలు పూరి జగన్నాథ్ స్టయిల్ కి చాలా దగ్గరగా ఉంటాయి కూడా. మామూలుగా రామ్ స్టయిల్ - బాడీ లాంగ్వేజ్ కూడా పూరి జగన్నాథ్ హీరో క్యారెక్టర్లకు బాగా దగ్గరగా, సూటయ్యేలా కనిపిస్తుంది. రామ్ ను సరిగ్గా వాడుకుంటే అతను ఎలాంటి ఔట్ పుట్ ఇస్తాడో రెడీ - కందిరీగ లాంటి సినిమాల్లో చూపించాడు. పూరి లాంటి డైరెక్టర్ అతణ్ని సరిగ్గా వాడుకుంటే కాంబినేషన్ కేక పుట్టిస్తుందేమో. ఓసారి ట్రై చూస్తే బెటర్.