ఫోటో స్టొరీ: స్టన్నింగ్ లుక్ లో రాపో!

Wed Mar 13 2019 18:13:51 GMT+0530 (IST)

మనకు టాలీవుడ్ లో ఉన్న చాలామంది హీరోలు ఉన్నారు కానీ ఒక హీరోకు ఉండాల్సిన అన్నీ క్వాలిటీస్ సమపాళ్ళలో ఉన్న హీరో రామ్. అందం.. నటన.. డ్యాన్స్.. బ్యాక్ గ్రౌండ్ తో పాటుగా తన కెరీర్లో హిట్లు కూడా చాలానే ఉన్నాయి.  సబ్జెక్టుల ఎంపికలో కనుక తడబడకుండా తనకు సూటయిన కథలు ఎంచుకుని ఉంటే ఇప్పటికే స్టార్ లీగ్ లో చేరాల్సిన సత్తా ఉన్న హీరో రామ్.  ఈమధ్య ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న రామ్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా 'ఇస్మార్ట్ శంకర్' పైనే పెట్టాడు.ఈ సినిమాలో రామ్ పాత్ర విభిన్నంగా ఉంటుందని..  రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి కదా.  దానికి తగ్గట్టే రామ్ జిమ్ములో కఠినమైన కసరత్తులు చేస్తూ కండలు పెంచుతున్నాడు.  కాసేపటి క్రితం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షర్ట్ లేకుండా సల్మాన్ ఖాన్ టైపులో తన కండలను చూపిస్తూ ఫోటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలకు "రాపో 2.0 లోడింగ్.. #ఇస్మార్ట్ శంకర్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.   మిలిటరీ క్రూ కట్ హెయిర్ స్టైల్.. గడ్డం తో డిఫరెంట్ గా ఉన్నాడు.  వీ-షేప్ ఫిజిక్ తో రామ్ కొత్త లుక్ బాలీవుడ్ హీరోలను తలపిస్తోంది. 

దర్శకుడు పూరి జగన్నాధ్ కు తన హీరోలను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తాడని పేరు.  అయన డిఫరెంట్ గా హీరోలను ప్రజెంట్ చేసి చేసి ప్రేక్షకులకు 'రొటీన్' అనిపిస్తోంది కానీ ఈ సారి కూడా పూరి తన రొటీన్ స్టైల్ లోనే రామ్ ను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తున్నట్టున్నాడు.  పూరి ఫ్లాపులలోనే ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రోమోలు.. రామ్ గెటప్ లు చూస్తుంటే ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు పెరిగేలా ఉన్నాయి.