పిక్ టాక్ : మరీ 'లోఫర్' 'రోగ్'లా ఉన్నాడుగా

Thu Jan 24 2019 13:30:58 GMT+0530 (IST)

2015లో వచ్చిన 'టెంపర్' తర్వాత పూరి జగన్నాధ్ కి పెద్దగా సక్సెస్ అందుకోలేక పోయాడు. భారీ అంచనాల నడుమ కొడుకుతో తీసిన 'మెహబూబా' చిత్రం తీవ్ర నిరాశ పర్చింది. మెహబూబా చిత్రం తర్వాత పూరి చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఎట్టకేలకు ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి దర్శకత్వంలో ఒక మూవీ ప్రారంభం అయ్యింది. తన ప్రతి సినిమాలో కూడా హీరోను అల్లరి చిల్లరగా చూపించే దర్శకుడు పూరి ఈ చిత్రంలో కూడా హీరో రామ్ ను అదే తరహాలో చూపించబోతున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూస్తుంటే అనిపిస్తుంది.'లోఫర్' చిత్రంలో వరుణ్ మరియు 'రోగ్' చిత్రంలో హీరో పాత్రల తరహాలో 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో రామ్ పాత్ర ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది. చేతిలో గన్ నోట్లో సిగరెట్ పెట్టుకుని షర్ట్ బటన్స్ విప్పి టోన్డ్ పాయింట్ వేసుకున్న రామ్ గత చిత్రాల్లోకి చాలా విభిన్నంగా కనిపిస్తున్నాడు. అయితే పూరి గత చిత్రాల్లో హీరో మాదిరిగానే రామ్ ఉన్నాడు. గతంలో పూరి ఇలాంటి హీరో పాత్రలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారింది.

హీరోలు కాస్త క్లాస్ గా రొమాంటిక్ గా ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. మరి ఈ చిత్రంలో మాత్రం రామ్ మరీ లోఫర్ లా కనిపిస్తున్నాడు. లుక్ ఎలా ఉన్నా ప్రేక్షకులను ఆకట్టుకునేలా స్క్రీన్ ప్లే తో సినిమాను తెరకెక్కిస్తే తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ఈ చిత్రం పూరి మరియు రామ్ లకు చాలా కీలకం. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అను ఎమాన్యూల్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.