Begin typing your search above and press return to search.

కమ్మ.. కాపు.. అంటూ వర్మ పాట

By:  Tupaki Desk   |   11 Feb 2016 7:12 AM GMT
కమ్మ.. కాపు.. అంటూ వర్మ పాట
X
ఇప్పటికే ఎన్నో వివాదాస్పద సినిమాలు తీశాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా వర్మ విజయవాడ కుల రాజకీయాలు, ఆధిపత్య పోరు నేపథ్యంలో ‘వంగవీటి’ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. టైటిల్ తోనే ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి నెలకొంది జనాల్లో. ఇలా సినిమా ప్రకటించడం ఆలస్యం.. అలా పని మొదలుపెట్టి పూర్తి చేసేయడం వర్మకు అలవాటు. ఆల్రెడీ ‘వంగవీటి’ ఫస్ట్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంతలోనే ఓ ఆసక్తికర పాటతో తయారైపోయాడు వర్మ. విజయవాడ రాజకీయాలన్నీ కమ్మ-కాపు కుల పోరు నేపథ్యంలోనే సాగాయన్న సంగతి తెలిసిందే. ఈ కులాల మీదే వర్మ పాటను రూపొందించడం విశేషం.

‘‘కమ్మ..కమ్మ... కమ్మ..కమ్మ కమ్మనైనా పగా...కమ్మేసింది.. కుమ్మేసింది కత్తులు దూసే దాకా...’’.. ‘‘కాపు.. కాపు... కాపు..కాపు... కాపుగాసే వేళా... కసిరేపింది.. కర్కశమంత కొడవలి గుచ్చే దాగా...’’ ‘‘అడ్డులేనిది.. హద్దులేనిదీ ఈ పోరూ.. ఆపలేకనే చూస్తూ ఉంది అమ్మోరూ...’’ ‘‘ వంగవీటి.. వంగవీటి వంగవీటి.. వంగవీటి వంగవీటి.. వంగవీటి’’ అంటూ సాగిపోయింది ఈ పాట. వర్మ తీయబోయే సినిమా ఎలా ఉండబోతోంది అనడానికి ఈ పాట ఓ ట్రంప్ కార్డ్ అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఎన్నడూ కులాల పేరుతో ఇలాంటి పాట వచ్చింది లేదు. బెజవాడ రాజకీయాలేంటో అవగాహన ఉన్న వాళ్లలో ఈ పాట ఉద్రేకాలు రేకెత్తించడం ఖాయం. మొత్తానికి వర్మ పెద్ద తేనెతుట్టెనే కదపబోతున్నట్లున్నాడు.