Begin typing your search above and press return to search.

ఎప్పుడూ చేయ‌ని ప‌ని చేసిన వ‌ర్మ‌

By:  Tupaki Desk   |   26 April 2017 10:14 AM GMT
ఎప్పుడూ చేయ‌ని ప‌ని చేసిన వ‌ర్మ‌
X
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఎప్పుడేం చేస్తారో ఎవ‌రూ ఊహించ‌లేరు. ఆయ‌న ఎప్పుడు ఎవ‌రిని పొగ‌డుతారో.. ఎప్పుడు తిట్ల దండ‌కం లంఘించుకుంటారో ఓ ప‌ట్టాన అర్థం కాదు. ప్రైవేట్‌.. ప‌బ్లిక్ అన్న‌తేడా లేకుండా విష‌యం ఏదైనా మాట్లాడేసే ఆయ‌న‌.. తీరు ఓ ప‌ట్టాన కొరుకుడు ప‌డ‌ని రీతిలో ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌న ట్వీట్ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కే ఆయ‌న‌.. ప‌లు వివాదాల‌కుకేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తుంటారు. చాలామందిపై చాలార‌కాలుగా ట్వీట్లు.. ఫోటోలు పెట్టే వ‌ర్మ‌.. ఎప్పుడూ త‌న కుమార్తెకు సంబంధించిన విష‌యాలు.. ఫోటోలు మాత్రం ట్వీట్ల‌లో పెట్ట‌టం అన్న‌ది ఉండ‌దు. కానీ.. ఈసారి అందుకుభిన్నంగా త‌న కూతురితో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన ఆశ్చ‌ర్యానికి గురి చేశారు.

ఎప్పుడూ లేని విధంగా కుమార్తె ఎందుకు గుర్తుకువ‌చ్చిందోకానీ.. త‌న మొద‌టి ట్వీట్‌లో కూతురి ఫోటో పెట్టేసి.. గ‌త జ‌న్మ‌కు సంబంధించిన ఫోటోగా చెప్పుకున్నారు. త‌ర్వాత అదే ఫోటోను మ‌రోసారి ట్వీట్ చేసి.. రాక్ష‌సుడిగా మార‌క ముందు నా మాన‌వ‌త్వం ఇంకా బ‌తికి ఉన్న మంచి రోజుల్లో నా కూతురితో దిగిన ఫోటో ఇదంటూ పోస్ట్ చేశారు. ఎప్పుడూ లేనిది వ‌ర్మ‌కు కూతురు గుర్తుకు రావ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/