Begin typing your search above and press return to search.

వర్మకి పాలిటిక్స్‌ పై ప్రేమ...ఎందుకంటే?

By:  Tupaki Desk   |   24 May 2016 4:26 AM GMT
వర్మకి పాలిటిక్స్‌ పై ప్రేమ...ఎందుకంటే?
X
సినిమా త‌ప్ప నాకు మ‌రో ప్ర‌పంచం తెలియ‌దంటుంటాడు రామ్‌ గోపాల్ వ‌ర్మ‌. ఇత‌ర విష‌యాల గురించి తెలుసుకోవాల‌నుకొన్నా అది సినిమాల కోస‌మే తెలుసుకొంటుంటాడాయ‌న‌. ఒక స్టార్ ద‌ర్శ‌కుడిగా నేష‌నల్ వైడ్‌ గా గుర్తింపు పొందిన ఆయ‌న‌కి త‌ర‌చుగా `పాలిటిక్స్‌ లో చేరే ఉద్దేశ‌మేమైనా ఉందా?` అన్న ప్ర‌శ్న ఎదురవుతుంటుంది. కానీ వ‌ర్మ మాత్రం నాకు పాలిటిక్స్ అర్థం కావు అని సింపుల్‌ గా తోసి పుచ్చుతుంటాడు. అలాంటి వ‌ర్మ `తొలిసారి నాకు పాలిటిక్స్‌ పై ప్రేమ పుట్టింది` అని చెప్పుకొచ్చాడు. అందుకోసం మోడీకి కృత‌జ్ఞ‌త‌లు కూడా చెప్పాడు. కొంప‌దీసి వ‌ర్మ బీజేపీలోకి చేర‌తాడా ఏంటి? అని కంగారు ప‌డ‌కండి. మోడీకి వ‌ర్మ‌ కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డానికీ, వ‌ర్మ‌కి పాలిటిక్స్‌ పై ప్రేమ పుట్ట‌డానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. అంగూర్‌ ల‌త అనే అంద‌మైన ఓ యంగ్ ఎమ్మేల్యేనే ఆ కార‌ణం.

అంగూర్‌ ల‌త ఓ అస్సామీ యాక్ట‌ర్‌. ప‌లు చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకొంది. మొన్న జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆమె బీజేపీ త‌ర‌ఫున పోటీ చేసి గెలిచింది. ఆమె అందాన్ని చూసిన వ‌ర్మ ఒక్క‌సారిగా పాలిటిక్స్‌ పై ప్రేమ పెంచుకొన్నాడు. అంగూర్‌ ల‌త టైట్ డ్రెస్సులో ఉన్న కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేస్తూ `ఒక ఎమ్మెల్యే ఇలా క‌నిపించిందంటే మంచి రోజులు వ‌చ్చిన‌ట్టే అర్థం` అని కామెంట్ పెట్టాడు. తొలిసారి నాకూ పాలిటిక్స్‌ పై ప్రేమ పుట్టిందంటూ అంగూర్‌ ల‌త‌కీ - మోడీకీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. త‌న అందంతో తెర‌పై ఓ ఊపు ఊపిన అంగూర్‌ ల‌త పాలిటిక్స్‌ లో ఎలా రాణిస్తుందో చూడాలి. అన్న‌ట్టు వ‌ర్మ పోస్ట్ చేసిన ఈఫొటోలు చూస్తుంటే నిజంగానే ఎవ‌రికైనా పాలిటిక్స్‌ పై ప్రేమ పుట్టేలాగే వుంది క‌దూ!!