Begin typing your search above and press return to search.

నా పొగరే అన్నిటికీ కారణం

By:  Tupaki Desk   |   26 May 2016 5:32 AM GMT
నా పొగరే అన్నిటికీ కారణం
X

రామ్ గోపాల్ వర్మకి మీడియా జనాలు సంచలన దర్శకుడు అనే బిరుదును ఇచ్చారు. ఇందుకు కారణం.. తన సినిమాలతోనే కాదు స్టేట్ మెంట్స్ తో కూడా సెన్సేషన్స్ సృష్టించగల కేపబిలిటీ ఉండడమే. తనకి పెట్టిన ముద్దుపేరుకు న్యాయం చేసేలానే ఉంటుంది వర్మ బిహేవియర్ కూడా. మాటలతోనే సగం పని కానిచ్చేయడం ఈ దర్శకుడి స్పెషాలిటీ.

ఆ మధ్య వంగవీటి అంటూ రంగా జీవితంపై సినిమా చేస్తున్నానని హంగామా చేసిన వర్మ.. ఇప్పుడు దాని సంగతి తేల్చకుండా.. వీరప్పన్ పై పడ్డాడు. కిల్లింగ్ వీరప్పన్ అంటూ కన్నడలో సక్సెస్ అవడంతో.. దీన్ని బాలీవుడ్ మీద కూడా రుద్దేసేందుకు ట్రై చేస్తున్నాడీయన. బాలీవుడ్ కోసం వర్మను చంపడం మాత్రమే కాకుండా.. మొత్తం వీరప్పన్ జీవితంపై సినిమాగా మార్చేస్తున్నాడు. ఇప్పుడీ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేశాడు. రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ ముంబైలో అడుగుపెట్టిన వర్మ.. గతంలో తను ఫ్లాప్ చిత్రాలు తీయడానికి కారణం తన పొగరే అని చెప్పడం విశేషం.

'నా గురించి నేను భావించేంతటి సైకోని కాదని అనుకుంటున్నా. ఒక పిచ్చోడు తాను పిచ్చోడినని ఎప్పటికీ తెలుసుకోలేడు. నిజాయితీగా మాట్లాడుకుంటే ప్రస్తుతం నాకు బ్రేక్ రావాలి. నన్ను నేను బయటి నుంచి చూసుకుంటే.. నా ఫ్లాప్ లకు కారణం నా పొగరే అని అర్ధమైంది. సబ్జెక్ట్ వర్కవుట్ అవుతుందా లేదా అనే విషయంలో నిర్లక్ష్యమే ఇందుకు కారణం. ఇప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకునే సిస్టమ్ ను ఏర్పాటు చేసుకున్నా' అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. సినిమా రిలీజ్ కి ముందు ఈయన నుంచి ఇలాంటి స్టేట్ మెంట్స్ చాలానే వస్తాయ్ లెండి.