Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ పాత్ర సరే.. మరి మిగిలినవి??

By:  Tupaki Desk   |   17 Oct 2017 10:48 AM GMT
ఎన్టీఆర్ పాత్ర సరే.. మరి మిగిలినవి??
X

ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' విషయంలో ఒక మెగా క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది. అదేమంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఏ స్టారూ నటించట్లేదు కాని.. ఆ పాత్రను ఒక కొత్త వ్యక్తి పోషిస్తున్నాడు. సర్లేండి.. కంటెంట్ లేకపోతే సూర్య యాక్ట్ చేసిన 'రక్త చరిత్ర 2' ఫ్లాప్ కాలేదా.. కంటెంట్ ఉన్నప్పుడు జనాలకు పెద్దగా తెలియని వివేక్ ఓబెరాయ్ ను హీరోగా పెడితే 'రక్తచరిత్ర 1' ఆడలేదా? అయితే ఇప్పుడు మన డిస్కషన్ అది కాదు.

నిజానికి వర్మకు ఉన్న ఒక ఇంటెలిజెంట్ ఎబిలిటీ ఏంటంటే.. ఇటువంటి రియల్ లైఫ్‌ స్టోరీలను సినిమాలుగా తెరకెక్కిస్తున్నప్పుడు.. ఎక్కువగా ఒరిజినల్ పాత్రలను పోలి ఉండే నటులనే ఎంచుకుంటాడు. అచ్చం హాలీవుడ్ లో కూడా ఇదే తరహాలో చేస్తారులే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఎన్టీఆర్ అండ్ లక్ష్మీ పార్వతి కోసం కొత్తవారిని ఎంచుకున్నట్లే.. మరి ఇతర ప్రముఖ పాత్రల కోసం కూడా కొత్తోళ్లనే తీసుకుంటాడా? అలా చేస్తే సినిమాలో పూర్తి తరహాలో కొత్త ఫేసులు అయిపోయి అసలు ప్యాడింగ్ అనేదే లేకుండా పోతోందిగా. కాని ఆ మిగతా పాత్రలను చేయడానికి పాపులర్ క్యారక్టర్ ఆర్టిస్టులూ కమెడియన్లు అంతగా సుముఖత చూపించట్లేదు. ఎందుకంటే ఆ పాత్రలను చేస్తే కనుక.. రియల్ లైఫ్‌ బ్రతికున్న ఆ పాత్రల ఒరిజినల్ మనుషుల దగ్గర నుండి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో అని ఫీలవుతున్నారట.

మొత్తానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో వర్మకు క్యాస్టింగ్ అంత వీజీ కాదులే. ఎందుకంటే ఈ సినిమాలో అసలు మనోడు ఏం చూపిస్తాడు అనేకంటే.. ఏం చూపిస్తాడో అనే సందేహం ఎక్కువగా ఉంది. ఏది ఎలా చూపించినా కూడా ఎక్కడో ఒక పార్టీ ఫీలయ్యే ఛాన్సే ఉంది.