భైరవ గీత అంటున్న ఆర్జీవీ!

Fri Aug 17 2018 22:42:19 GMT+0530 (IST)

ఎన్నైనా చెప్పండి.. తప్పో ఒప్పో రామ్  గోపాల్ వర్మ రూటే సెపరేటు. అందరూ రామ్ గోపాల్ వర్మ అంటే బ్రిలియంట్ ఫిలింమేకర్ అని అంటుంటారుగానీ ఒక విషయం మాత్రం పూర్తిగా మిస్ అవుతారు..  అదేంటంటే 'బిజినెస్ మ్యాన్ ' లో మహేష్ చెప్పినట్టు ముంబై కి వెళ్లి అక్కడ వాళ్ళ చేత 'అది' పోయించి వచ్చాడు. అదేమీ అంత సులువు కాదు.. ఇంతకు ముందు తెలుగువాళ్ళు ఎవరూ ఆ పని చేయలేక పోయారు.  ఇప్పటికీ వర్మ లాగా బాలీవుడ్ ను షేక్ చేసిన తెలుగు డైరెక్టర్ ఒక్క రాజమౌళి మాత్రమే.  కానీ ఆ మిషన్ చాలా చాలా కష్టం.  నిజంగానే మన టాలీవుడ్ ని ఓ పాతికేళ్ళు ఫాస్ట్ ఫార్ వార్డ్ కొడితే అదే 'బాలీవుడ్'.వర్మది అంతా గత చరిత్ర.  'ఆఫీసర్' తర్వాత వర్మ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అయింది. ఎంతగా అంటే వర్మగారి వీర భక్తులకు రైల్వే స్టేషన్ లో ఉన్న హై టెన్షన్ వైర్ తగిలీ తగలనట్టు తగిలితే ఏమౌతుందో అలా..!!  దానికే ఉలుకూ పలుకూ లేదు. ఇక నిజంగా షాక్ తగిలితే ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా తెలీదు కదా. భక్తులన్నవాళ్ళు అప్పుడప్పుడూ మూఢభక్తిలోకి వెళ్తారు. దాని పరిణామాలే ఇవి.  కానీ ఆ భక్తులకోసమేమో రామ్ గోపాల్ వర్మ 'భైరవ గీత' అనే సినిమాతో రానున్నాడు.

ఇది భగవద్గీత కు వర్మ వెర్షనో లేక 'విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' కు గీత వెర్షనో తెలీదు. ఈ విషయం గురించి ఈరోజే అప్డేట్ ఇచ్చాడు. కానీ వర్మ నిర్మాత మాత్రమే. భాస్కర్ అనే అతనితో కలిసి నిర్మించాడట.  సిద్ధార్థ అనే అతను డైరెక్ట్ చేశాడట.  ఆ సినిమాలో నుండి ఒక పిక్ ఇది.  ఓ లుక్కేయండి.