Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబులా ఆర్జీవీ మైన‌స్

By:  Tupaki Desk   |   13 Dec 2018 5:55 AM GMT
చంద్ర‌బాబులా ఆర్జీవీ మైన‌స్
X
ఆర్జీవీ ప‌బ్లిసిటీ జిమ్మిక్కు.. చంద్ర‌బాబు ప్ర‌చారార్భాటం ఇంచుమించు ఓకేలా ఉంటాయా? అంటూ ఓ కొత్త విశ్లేష‌ణ టాలీవుడ్‌ లో జోరందుకుంది. బాబు సొంత మీడియాల‌తో చేసిన హంగామా చూసి తెలంగాణ‌లో మ‌హాకూట‌మి గెలుస్తుంద‌ని భ్ర‌మించిన వారికి పెద్ద జోల్ట్ త‌గిలింది. ఇంకా చెప్పాలంటే బాబు వ‌ల్ల‌నే కూట‌మి ఓట‌మిపాలైంద‌న్న విశ్లేష‌ణ జోరుగా సాగుతోంది. తెలంగాణ‌లో బాబు భ‌విష్య‌త్ జీరో అని ఫ‌లితాలు తేల్చాయి. అదంతా అటుంచితే బాబుగారికే తాత‌య్య‌లా ప‌బ్లిసిటీ జిమ్మిక్కులో రాటు దేలిపోయిన ఆర్జీవీ ప్ర‌తిసారీ అదే ఎత్తుగ‌డ‌ను అనుస‌రిస్తుండ‌డంతో అత‌డికి స‌రైన ఫాలోయింగే లేకుండా పోయింద‌ని ఫిలింస‌ర్కిల్స్‌ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం అత‌డు ఏ సినిమాకి ప‌బ్లిసిటీ చేసినా అక్క‌డ మీడియా హ‌డావుడి ఏమాత్రం ఉండ‌డం లేదు. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా మీడియాని ప‌బ్లిసిటీకి చిత్తుగా వాడుకుని విసిరేస్తాడ‌న్న అప‌వాదు అత‌డిపై ఉంది. ఆ ప్ర‌భావం అత‌డితో జ‌ట్టు క‌ట్టే ఇత‌ర హీరోలు - నిర్మాత‌ల‌పైనా ప‌డుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇటీవ‌లి కాలంలో అస‌లే సినిమాల్లేక కెరీర్ ప‌రంగా జీరో అయిపోయిన ఆర్జీవీ ఇప్పుడు ఏం చేసినా చెల్లుబాటు కావ‌డం లేదు. దీంతో అత‌డి చుట్టూ ఉన్న కోట‌రీకి ఇది మైన‌స్ గా మారుతోంద‌ని విశ్లేషిస్తున్నారు.

ఇక ఈ వారంలో రిలీజ‌వుతున్న చిన్న సినిమా `భైర‌వ‌గీత‌`కు ఆర్జీవీ అస‌లేమీ కాడు. నిర్మాత కాదు.. స‌మ‌ర్ప‌కుడు కూడా కాదు.. ఒక కొత్త ద‌ర్శ‌కుడిని త‌న‌లాగా సినిమా తీసే వాడిని ప్ర‌మోట్ చేస్తున్నాడు. అయితే స‌ద‌రు యువ‌ద‌ర్శ‌కుడు లేదా నిర్మాత‌లు ఆర్జీవీతో ప్ర‌మోష‌న్ చేయించ‌డ‌మే పెద్ద మైనస్ అన్న మాటా వినిపిస్తోంది. వ‌ర్క‌వుట్ కాని ఫ్రీ ప‌బ్లిసిటీ స్టంట్ స్ట్రాట‌జీ ముప్పు తెస్తోంద‌న్న‌ది ఓ వాద‌న వినిపించింది. నిన్న‌టి సాయంత్రం ఏఎంబీ సినిమాస్‌ లో వేసిన ప్రివ్యూకి మీడియా జ‌నం లేక‌పోవ‌డం దానికి ఓ నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. మ‌రో ర‌కంగా అస‌లు వ‌ర్మ ప్ర‌చారానికి రాక‌పోతే ప్ల‌స్ అయ్యేదేన‌ని మీడియాలో టాక్.. వర్మ ప‌బ్లిసిటీ జిమ్మిక్కును న‌మ్మ‌ని మీడియా జ‌నం ప్ర‌స్తుతం యూటర్న్ తీసుకుని ఆలోచించ‌డం మొద‌లు పెట్ట‌డం వ‌ల్ల‌, అయిన‌దానికి కాని దానికి మీడియాని అడ్డంగా వాడేస్తున్నాడ‌న్న అప‌వాదు వ‌ల్ల మొత్తానికి ఆయ‌న‌తో జ‌ట్టుక‌ట్టే వారికి, రిలీజ‌వుతున్న సినిమాల‌కు పెద్ద మైన‌స్ అయ్యింద‌ని విశ్లేషిస్తున్నారు. ఒక‌వేళ ఇదే క‌రెక్ట్ అని భావిస్తే ఇక‌పై ఆర్జీవీతో జ‌ట్టు క‌ట్ట‌డం న‌వ‌త‌రం మానుకోవాల‌ని సూచిస్తున్నారు కొంద‌రు.