Begin typing your search above and press return to search.

సెన్సార్ బోర్డు ఎందుకు దండగ

By:  Tupaki Desk   |   30 Nov 2015 9:10 AM GMT
సెన్సార్ బోర్డు ఎందుకు దండగ
X
సెన్సార్ బోర్డుపై మరోసారి ధ్వజమెత్తాడు రాంగోపాల్ వర్మ. అరచేతిలో శృంగారం అందుబాటులో ఉన్నపుడు తెర మీద ఏం చూడాలో సెన్సార్ బోర్డు నిర్ణయించడం ఏంటని అడుగుతున్నాడు వర్మ. ప్రస్తుత పరిస్థితుల్లో సెన్సార్ బోర్డును రద్దు చేయడం బెటర్ అని వర్మ అభిప్రాయపడ్డాడు.

‘‘ప్రస్తుతం ఏం సమాచారం కావాలన్నా ఇంటర్నెట్‌ లో తక్షణం అందుబాటులో ఉంటోంది. ఇలాంటి కాలంలో సెన్సార్ బోర్డు అవసరమేంటి? పోర్న్ సైట్లు చూడాలనుకున్నా.. సెల్‌ఫోన్లలో అందుబాటులో ఉంటున్నాయి. మనం డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నాం. నలుగురైదుగురు కూర్చుని దేశం మొత్తం ఏం చూడాలి.. ఏం చూడకూడదు అనేదానిపై నిర్ణయం తీసుకోవడం అసంబంద్ధం’’ అని వర్మ అన్నాడు. ఐతే జేమ్స్ బాండ్ సినిమా ‘స్పెక్టర్’లో ముద్దు సన్నివేశాల్ని కుదించడానికి సంబంధించి సెన్సార్ బోర్డు చీఫ్ నిహ్లానీ తన పని తాను చేశాడని.. నిబంధనల మేరకే నడుచుకున్నాడని వర్మ అభిప్రాయపడ్డాడు.

మరోవైపు బాలీవుడ్ బ్యూటీ దివ్య దత్తా కూడా సెన్సార్ బోర్డు అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. సినిమా అనేది క్రియేటివ్ ఫీల్డ్ ని.. ఏ విషయాన్ని ఎలా చూపించాలని దర్శకులకు తెలుసని.. ఏం చూడాలి ఏం చూడకూడదు అన్నది కూడా జనాలకు తెలుసని.. అలాంటపుడు సెన్సార్ షిప్ అవసరం ఏముందని ఆమె ప్రశ్నించారు.