Begin typing your search above and press return to search.

ట్రంప్ కూతుర్నీ వ‌ర్మ వ‌ద‌ల్లేదుగా..

By:  Tupaki Desk   |   19 Nov 2017 10:00 AM GMT
ట్రంప్ కూతుర్నీ వ‌ర్మ వ‌ద‌ల్లేదుగా..
X
వివాదాల‌కు కేరాఫ్‌.. రాం గోపాల్ వ‌ర్మ‌! వ‌ర్మ ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదం. వ‌ర్మ ఎలాంటి ట్వీట్ చేసినా.. ఎలా స్పందించినా కూడా వివాద‌మే!! వ‌ర్మ అంటేనే వివాదం!! ఆ రేంజ్‌ కు ఎదిగిపోయిన అగ్ర‌ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌.. మ‌నోళ్ల‌నే కాదు.. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల ప‌ట్టి.. ముద్దుల కూతురు ఇవాంకాను సైతం వ‌ద‌ల్లేదు. కామెంట్ల‌తో కుమ్మేశాడు. త‌న దృష్టి ఆమె అందాల‌పైనే ఉంటుంద‌ని వ్యాఖ్య‌లు చేసేశాడు. అంతేకాదు, సెక్సీ డాల్‌.. స‌న్నీలియోన్ తో ముడిపెట్టి మ‌రీ ఇవాంకాపై కామెంట్లు కుమ్మ‌రించేశాడు. వ‌ర్మ చేసిన ఈ కామెంట్ల‌పై నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది.

విష‌యంలోకి వెళ్తే.. ట్రంప్ కుమార్తె ఇవాంక‌.. హైద‌రాబాద్ రానున్నారు. ఇక్క‌డ మూడు రోజులు జ‌రిగే.. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు ఇవాంక హ‌జ‌రుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని అమెరికా- భారత్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ స‌ద‌స్సులో యువ ప్ర‌తినిధిగా, యువ‌త‌కు పారిశ్రామికంగా ప్ర‌పంచం అందిస్తున్న అవ‌కాశాల‌పై ఇవాంక ప్ర‌సంగించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌ ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు అష్ట‌దిగ్భంధ‌నం చేశాయి. ఇవాంక డిన్న‌ర్ చేస్తార‌ని భావిస్తున్న ఫ‌ల‌క్‌ నుమా ప్యాలెస్‌ ను సైతం అధికారులు త‌మ ర‌క్ష‌ణ‌లోకి తీసుకున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే, ఇవాంక రాక‌పై వ‌ర్మ త‌న‌దైన శైలిలో చేసిన కామెంట్లే సంచ‌ల‌నం రేపుతున్నాయి. ‘నాకు ఏ మాత్రం రాజకీయ అవగాహన లేదు. ఇవాంక హైదరాబాద్‌ లో ఎందుకు పర్యటిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆమె అందాన్ని చూడటానికి మాత్రం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. గతంలో సన్నీ లియోనీ ఇండియాకు వచ్చినప్పడు ఎంత ఎగ్జయిట్‌ అయ్యానో.. ఇప్పుడూ అంతే ఆత్రుతతో ఉన్నా ’ అని వర్మ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇవాంకను బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ తో పోలుస్తూ వర్మ చేసిన ఈ పోస్ట్‌ వైరల్ అవుతోంది. మొత్తానికి వ‌ర్మ తన బుద్ధి పోనిచ్చుకోలేద‌నే రివ‌ర్స్ కామెంట్లు కూడా క‌నిపిస్తున్నాయి.