Begin typing your search above and press return to search.

ఆమె ఫ్యాన్స్ కు సెల్యూట్ -వర్మ

By:  Tupaki Desk   |   19 Aug 2017 11:04 AM GMT
ఆమె ఫ్యాన్స్ కు సెల్యూట్ -వర్మ
X
సినిమా తారలు ఎవరైనా వారి పరిసర ప్రాంతాలకు వస్తున్నారంటే చాలా జనాలు ఒక్కసారిగా పనులన్నీ మానేసుకొని స్టార్స్ ని చూడటానికి వస్తారు. అలాగే వచ్చేవారికి కూడా స్టార్ హోదా ఓ రేంజ్ లో ఉంటేనే జనాలు ఎక్కువ సంఖ్యలో వచ్చి చూడటానికి ఇష్టపడతారు. అయితే రీసెంట్ గా కేరళలో సెక్సీ తార సన్నీ లియెన్ రాకను గమనించిన జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఇసుక వేస్తే కూడా రాలనంత జనం వచ్చారంటే సన్నీపై కేరళ పురుషులు ఏ రేంజ్ లో ప్రేమను పెంచుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మరి సన్నిలియెన్ లాంటి సుందరి న్యూస్ ఇంత హాట్ టాపిక్ అయితే రామ్ గోపాల్ వర్మ ఊరుకుంటాడా. ఎప్పటిలానే తన కామెంట్స్ తో ఆకట్టుకున్నాడు. సన్నీ లియెన్ కోసం ఎగబడ్డ జన సమూహాన్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందంటూ.. ఆమె కోసం వచ్చిన అభిమానులను చూసి కేరళా సూపర్ స్టార్స్ మమ్ముట్టి.. మోహన్ లాల్ జలస్ ఫీలవుతారన్నారని.. ఎందుకంటే కేరళలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నా ఆ ఫెమస్ స్టార్స్ ని చూడటానికి జనాలు ఇలా ఎప్పుడూ రాలేదని తనదైన శైలిలో పేస్ బుక్ ద్వారా కామెంట్ చేశాడు వర్మ. అంతే కాకుండా సన్నీ కోసం వచ్చిన జనసంద్రం ఫోటోని పోస్ట్ చేసి..వచ్చిన వారందరికీ సెల్యూట్ అంటూ కామెంట్ పెట్టాడు ఈ విలక్షణ దర్శకుడు.

నిజంగా సన్నీ లియెన్ జన సంద్రాన్ని చుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. ఓ మొబైల్ ఓపెనింగ్ కోసం వచ్చిన సన్నీ అక్కడికి వచ్చిన కేరళ జనాలను చూసి తనకు ఇంత మంది అభిమానులు ఉన్నారా అని ఆశ్చర్యపోయింది. కేరళకు వెళ్లి వచ్చిన అనంతరం ఆ జన సమూహం ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరీ వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పింది సన్నీ.