Begin typing your search above and press return to search.

వర్మ స్టయిల్లో అదిరిందిగా..

By:  Tupaki Desk   |   20 Nov 2017 4:15 AM GMT
వర్మ స్టయిల్లో అదిరిందిగా..
X
మామూలుగా ఎవరైనా ముందు సినిమా మొదలెట్టి కొంత పార్ట్ తీశాకో.. లేదంటే ఫినిషింగ్ కు వచ్చాకో ప్రమోషన్లు మొదలెడతారు. కానీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్టయిలే వేరు కదా. స్టార్టవక ముందు నుంచే తన సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో.. ఏం చేస్తే అందరి దృష్టి తనపై పడుతుందో రామ్ గోపాల్ వర్మకు బాగా తెలుసు. అందుకే హీరో నాగార్జునతో తీయబోయే సినిమాకు ఫస్ట్ పోస్టర్ తో రిలీజ్ కు ముందే సెన్సేషన్ కు తెరలేపాడు.

ఈమధ్య ఫ్యామిలీ పిక్చర్లు.. ఎంటర్ టెయినర్లు చేసి రొటీన్ అయిపోయిందని.. మంచి యాక్షన్ పిక్చర్ చేయాలనుందని నాగార్జున ఫీలయ్యాడు. అందుకే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నానని ప్రకటించాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్న సందర్భంగా ఆర్జీవీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఓ టేబుల్ పై పిస్టల్ - పోలీస్ - ఏక్ గ్లాస్ చాయ్... ఇంకేవీ లేవు. జస్ట్ ఒక్క ఫొటోతోనే కావాల్సిన సినిమాపై మంచి ఇంట్రస్ట్ క్రియేట్ చేశాడు ఆర్జీవీ. తనకు బాగా అలవాటయిన పోలీస్ - మాఫియా బ్యాక్ డ్రాప్ తోనే సినిమా తీస్తున్నానని చెప్పకుండానే చెప్పేశాడు. తన సొంత ప్రొడక్షన్ అయిన కంపెనీ బ్యానర్ పైనే సినిమా తీయబోతున్నాడు.

రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ వెండితెరగా పరిచయమైంది నాగార్జున హీరోగా నటించిన శివ సినిమాతోనే. తరవాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో అంతం.. గోవిందా.. గోవిందా సినిమాలు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాల తరవాత వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. మాఫియా - పోలీస్ కథలను ఎన్నయినా ఆసక్తికరంగా చెప్పగలగడం ఆర్జీవీ స్పెషాలిటీ. నాగ్ ఆశించినట్టు మంచి యాక్షన్ ఎంటర్ టెయినర్ తీయాలనే ఆశిద్దాం.