గ్లాస్ హౌస్ దగ్గర సెంటిమెంట్ క్లాప్ కొడతారట

Sun Nov 19 2017 19:00:01 GMT+0530 (IST)

తెలుగు సినిమా చరిత్రను రెండు భాగాలుగా చేస్తే.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివకు ముందు.. శివ తర్వాత అన్న విభజన రేఖను క్లియర్ గా  గీస్తారు. తెలుగు సినిమా రూపురేఖల్ని మొత్తంగా మార్చేసిన శివ చిత్రం క్రియేట్ చేసిన రికార్డులు అన్నిఇన్ని కావు.శివ సినిమా వాణిజ్యంపరంగా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ  సినిమా ప్రభావం సమాజం ఎంతన్నది కూడా  అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. తెలుగు సినిమాకు సాంకేతికంగా సరికొత్త ప్రమాణాల్ని నెలకొల్పింది. అప్పుడెప్పుడో జరిగి పోయిన విషయాన్ని ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే.. కారణం లేకపోలేదు.

28 ఏళ్ల క్రితం శివ మూవీని ఎలా స్టార్ట్ చేశారో.. అచ్చు గుద్దినట్లుగా తాజాగా నాగార్జున.. రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో  మూవీని అదే రీతిలో స్టార్ట్ చేయనున్నారు.శివ సినిమా ముహుర్తం షాట్ ను అన్నపూర్ణ స్టూడియో దగ్గర గ్లాస్ హౌస్ దగ్గర  ఆ రోజు (నవంబరు20)  ఎలా అయితే  షాట్ తీశారో..తాజా మూవీకి సంబంధించిన షాట్ ను అదే రీతిలో తీయనున్నట్లుగా చెబుతున్నారు.

శివ సినిమాకు వర్మ తండ్రి క్లాప్ కొట్టగా.. తాజా మూవీకి వర్మ తల్లి క్లాప్ కొట్టనున్నారు. సెంటిమెంట్ ను తూచా తప్పకుండా ఫాలో అవుతున్న తాజా మూవీ ఎలాంటి రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో చూడాలి. సినిమా వాళ్లకు మామూలుగానే సెంటిమెంట్లు ఎక్కువ. అందులోకి రికార్డు విజయం సాధించిన తర్వాత మళ్లీ అదే కాంబినేషన్ తో మూవీ తీస్తున్న వేళ..  నాడు చేసినట్లే రేపు చేయనున్నారట.