Begin typing your search above and press return to search.

సెక్సీ ఖాన్‌ తో వర్మ.. ఖల్లాస్..

By:  Tupaki Desk   |   5 May 2016 3:30 PM GMT
సెక్సీ ఖాన్‌ తో వర్మ.. ఖల్లాస్..
X
పధ్నాలుగేళ్ల క్రితం వర్మ తీసిన కంపెనీ అనే మూవీ.. బాలీవుడ్ క్లాసిక్స్ లో నిలిచిపోయేంతగా పేరు సంపాదించింది. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించిందో.. కంపెనీలో ఖల్లాస్ ఐటెం సాంగ్ అంతకంటే ఎక్కువ పేరు సంపాదించుంకుంది. నాగార్జున మూవీ చంద్రలేఖలో లేఖగా నటించిన ఇషా కొప్పికర్.. ఖల్లాస్ అంటూ కంపెనీలో వేసిన చిందులు బాలీవుడ్ జనాలను మత్తెక్కించి, ఊపేశాయి.

ఇప్పుడా పాటను, ఆ పాట క్రియేట్ చేసిన మేజిక్ ను మరోసారి రిపీట్ చేసేందుకు రామ్ గోపాల్ వర్మ రెడీ అయిపోతున్నాడు. తన సినిమాలోని పాటను తనే మళ్లీ ఉపయోగించుకోబోతున్నట్లు చెప్పాడు వర్మ. అఫ్పుడు ఇషా కొప్పికర్ ను ఈ ఖల్లాస్ పాట కోసం తీసుకొస్తే.. ఈ సారి సెక్సీ లేడీ జరీన్‌ ఖాన్ తో చిందులు వేయించనున్నట్లు చెప్పాడు వర్మ. 'ఖల్లాస్ సాంగ్ లైన్స్ డార్విన్ సిద్ధాంతాన్ని గుర్తు చేసేస్తాయి. వీరప్పన్ ను ఖల్లాస్ చేసేందుకు వాటిని మరోసారి చూపించబోతున్నా. ఈ సారి అడవిలో జరీన్‌ డ్యాన్సులు చూడచ్చు' అంటూ ట్వీట్ చేశాడు వర్మ.

వాటర్ - ఫైర్ థీమ్ తో... ఫారెస్ట్ సెట్ లో ఈ పాట పిక్చరైజేషన్ చేయబోతున్నామని చెప్పిన వర్మ.. ఖల్లాస్ పాటకు న్యాయం చేయగల సత్తా జరీన్‌ ఖాన్ కు మాత్రమే ఉందని చెబుతున్నాడు. కిల్లింగ్ వీరప్పన్ హిందీ వెర్షన్ లో చాలా సీన్లను మళ్లీ తీస్తున్న వర్మ.. ఇప్పుడు ఖల్లాస్ అంటూ మరోసారి ఆకట్టుకునేందుకు ట్రై చేస్తున్నాడు.