Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీకి వర్మ హెల్ప్ చేశాడే

By:  Tupaki Desk   |   19 April 2018 11:18 AM GMT
మెగా ఫ్యామిలీకి వర్మ హెల్ప్ చేశాడే
X
శ్రీరెడ్డి టాలీవుడ్ ఇండస్ట్రీపై చేస్తున్న దారుణమైన ఆరోపణల కారణంగా.. ఇప్పుడు పరిశ్రమ వర్గాలు అంతా ఏకం అవుతున్నాయని.. ఇప్పటివరకూ విబేధాలు ఉన్నవారు కూడా కలుస్తున్నారంటూ.. రెండు రోజుల క్రితం జీవితా రాజశేఖర్ కామెంట్ చేసిన విషయం జనాలకు కచ్చితంగా గుర్తుంటుంది.

ఇప్పుడు శ్రీరెడ్డి విషయంలో తల దూర్చిన రాంగోపాల్ వర్మ.. ఓ విధంగా ఇన్ డైరెక్టుగా మెగా ఫ్యామిలీకి బోలెడంత సాయం చేశాడని చెప్పవచ్చు. ఇన్నాళ్లూ పవన్ సైలెంట్ గా ఉండమని చెప్పడంతోనే మిన్నకున్నామని.. ఇప్పుడు వార్ తప్పదు అంటూ బన్నీ వాస్ నేరుగా రాంగోపాల్ వర్మకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ వాస్ అంటే.. అల్లు అరవింద్ ప్రియ శిష్యుడు. ఇంతకాలం పవన్ ఫ్యాన్స్ కి - అల్లు వారి క్యాంప్ కి కాసింత గ్యాప్ ఉంది. రంగస్థలం మూవీతో పవన్- చెర్రీ క్లోజ్ నెస్ గురించి తెలిసింది. ఇప్పుడు ఆర్జీవీ కారణంగా.. మెగా ఫ్యామిలీ అంతా ఒకటి అవుతోంది.

పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ కారణంగా.. అల్లు అరవింద్ కూడా బైటకొచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ ఒక్కడు కనుక.. పవన్ కు పాజిటివ్ గా కామెంట్ చేయడం లాంటివి చేసేస్తే.. మొత్తం మెగా క్యాంప్ అంతా ఒకటి అయిపోయినట్లే. అటోమేటిగ్గా ఫ్యాన్స్ కూడా చేరిక అయిపోతారు. నా పేరు సూర్య రిలీజ్ కి ముందు ఇలా ఫ్యాన్స్ లో యూనిటీకి అవకాశం ఏర్పడడం మంచిదే కదా!