Begin typing your search above and press return to search.

అయ్యా వర్మా.. జక్కన్నను ఒగ్గేయండయ్యా

By:  Tupaki Desk   |   24 April 2017 8:43 AM GMT
అయ్యా వర్మా.. జక్కన్నను ఒగ్గేయండయ్యా
X
రాం గోపాల్ వర్మ అంటేనే సంచలనాలకు కేంద్ర బిందువు. రాజమౌళి కూడా సెన్సేషన్స్ సృష్టిస్తాడు కానీ.. వర్మ టైపులో మాత్రం కాదు. ప్రపంచంలోని ప్రతీ అంశాన్ని తనదైన ప్రత్యేక కోణంలోంచి వర్మ చూస్తే.. జక్కన్న మాత్రం ఏ విషయాన్ని అయినా సినిమా యాంగిల్ లోంచే చూస్తాడు. వీళ్లిద్దరిని కలిపి చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటే.. ట్విట్టర్ లో వీరి మాటల కారణంగానే.

టైగర్ ష్రాఫ్- విద్యుత్ జమాల్ ల విషయంలో క్షమార్పణలు వేడుకున్న తర్వాత.. వర్మ ఈ మధ్య వెటకారం ట్వీట్స్ జోలికి వెళ్లడం లేదనే చెప్పాలి. అయితే.. రాజమౌళితో తాను కలిసి దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసిన వర్మ.. 'ఘోరమైన భయంకరమైన విషయం ఏంటంటే.. నేను- రాజమౌళి.. బాహుబలి2 మూవీ కంటే అందంగా ఉన్నాం' అంటూ ట్వీట్ పెట్టాడు. నిజానికి వర్మకు ఇలాంటివి సహజమే కాబట్టి జనాలు పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు కానీ.. ఈ ట్వీట్ కు ఆశ్చర్యకరంగా రాజమౌళి నుంచి రిప్లై వచ్చింది.

'అయ్యా.. నన్ను ఒగ్గేయండయ్యా' అంటూ రెండు దండాలు పెడుతున్న సింబల్స్ ను కూడా పోస్ట్ చేశాడు జక్కన్న. ప్రస్తుతం బాహుబలి2 చిత్రాన్ని మరో నాలుగు రోజుల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్న రాజమౌళి.. ఎలాంటి వివాదంలోను చెయ్యి-కాలు పెట్టే ఉద్దేశ్యంలో లేడు. అందుకనే ఇలాంటి రిప్లై ఇవ్వాల్సి వచ్చింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/