Begin typing your search above and press return to search.

రెండు కోట్లు ఆమె వల్లేనన్న వర్మ

By:  Tupaki Desk   |   18 May 2019 4:11 AM GMT
రెండు కోట్లు ఆమె వల్లేనన్న వర్మ
X
ఎందుకు తీస్తాడో ఏం తీస్తాడో తనకే క్లారిటీ లేని వర్మ ఒక్కోసారి కంటెంట్ తోనో లేక సెన్సేషన్ తోనో యూట్యూబ్ లో రికార్డులు కొడుతూ ఉంటాడు. అలాంటిదే ఇది కూడా. రెండేళ్ల క్రితం వర్మ తన ఛానల్ లో ది ఫారినర్ అనే షార్ట్ ఫిలిం ఒకటి అప్ లోడ్ చేశాడు. అది ఇప్పుడు 2 కోట్ల వ్యూస్ దాటేసి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకుపోతోంది. అందులో నటించిన సాషా జుర్కో నిన్న వర్మ కంట పడింది.

ఈయన ఆఫీస్ కు దగ్గరలో ఉండే మీరా బెల్లా రెస్టారెంట్ లో ఉండగా కలుసుకుని ఫోటో క్లిక్ మనిపించి ఒక షార్ట్ ఫిలిం కు 2 కోట్ల 60 లక్షల వ్యూస్ రావడానికి కారణం తనే అంటూ దాని తాలూకు లింక్ పోస్ట్ చేశాడు వర్మ. ఇది తనకు మొదటి యాక్టింగ్ ఎక్స్ పీరియన్స్ కావడం విశేషం. తరుణా ఖంగన్ వాల్ రూపొందించిన ఈ మూవీని వర్మ తన ఆర్జివి ఫ్యాక్టరీ ద్వారా ప్రమోట్ చేశాడు

16 నిముషాలు ఉన్న ఈ షార్ట్ ఫిలిం లో కథ సందేశంతో కూడి ఉంటుంది. ఓ ఫ్లాట్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని పనుల నెపంతో వచ్చిన ఓ లేబర్ బృందం తను ఇచ్చే చనువుకి ఉబ్బితబ్బిబ్బు అయిపోయి ఒక్కొక్కరుగా పరిచయం చేసుకోవడం మొదలుపెడతారు. అయితే ఆ సాకుతో వాళ్ళు తన అందం మీద కన్నేశారని అనుమానించిన హీరోయిన్ వాళ్ళను బలవంతంగా పంపించేస్తుంది.

ఓ రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో తనను రేప్ చేసేందుకు ఓ టీమ్ వస్తుంది. ప్రతిఘటిస్తున్న సమయంలో తను అవమానించి పంపిన లేబర్ బృందమే ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడతారు. దీంతో జ్ఞానోదయం అవుతుంది. వర్మ స్టైల్ లో అక్కర్లేని కెమెరా యాంగిల్స్ అవసరానికి మించిన గ్లామర్ ప్రదర్శన ఎక్కువగానే ఉన్నా ఫైనల్ గా మెసేజ్ వ్యూయర్స్ కి కనెక్ట్ అయిపోయింది. దానికి తోడు ఈ సాషా గ్లామర్ బోనస్. అందుకే వర్మ ఇంత స్పెషల్ గా దీని గురించి చెప్పాడు.