Begin typing your search above and press return to search.

లింకన్, జాన్.ఎఫ్.కెనడీ తరువాత ట్రంపేనట

By:  Tupaki Desk   |   6 May 2016 11:30 AM GMT
లింకన్, జాన్.ఎఫ్.కెనడీ తరువాత ట్రంపేనట
X
ట్విట్టర్ ఘాటు కామెంట్లు చేసే సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డొనాల్డు ట్రంపుపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వల్ల అమెరికా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో వర్మ జ్యోతిష్యం చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా భవిష్యత్ అంధకారమేనని సర్వేలు గగ్గోలు పెడుతున్న తరుణంలో... ట్రంప్ అధికారంలో ఉంటే అమెరికా జీడీపీ 2కి పడిపోతుందని ఫైనాన్షియల్ సంస్థలు ఆందోళన చెందుతున్న సమయంలో వర్మ మాత్రం ట్రంపుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ చరిత్రలో నిలిచిపోతారనిపిస్తోందని ట్వీట్ చేశాడు. అమెరికా చరిత్రలో నిలిచిపోయిన జాన్ ఎఫ్ కెన్నెడీ - అబ్రహాం లింకన్ ల సరసన చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ నిలుస్తారని వర్మ అంటున్నారు. అయితే.. వర్మ నిజంగానే అంటున్నారో.. లేదంటే వెటకారమాడుతున్నారో తెలియక నెటిజన్లు దానిపై తలోరకంగా స్పందిస్తున్నారు. కాగా మరికొందరు మాత్రం వర్మ ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తోకముడుచుకుని అమెరికా విషయాలపైకి మళ్లిపోయాడని అంటున్నారు.

కొద్దిరోజుల కిందట ట్విట్టర్ పవన్ కళ్యాణ్ గురించి వర్మ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ తరువాత మొన్నమొన్న రజనీకాంత్ మీద పడ్డాడు. రజనీ అభిమానులు కూడా వర్మను ఒక రేంజిలో వేసుకున్నారు. దీంతో మళ్లీ మరోసారి పవన్ కల్యాణ్ పై కౌంటర్లు వేశాడు.... మళ్లీ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో వార్నింగులు ఇవ్వడంతో ఇక ఇక్కడ లాభం లేదని ఏకంగా అమెరికా వైపు మారిపోయాడు. ట్రంపు విషయంలో వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచమంతా జోకర్లా చూస్తున్న ట్రంప్ అమెరికా చరిత్రలో అత్యద్భుత అధ్యక్షుడు అవుతాడని వర్మ జ్యోష్యం చెబుతున్నాడు.