Begin typing your search above and press return to search.

టెర్రరిస్టుల కోసం స్కూళ్ళ సిలబస్‌ మార్చాలా?

By:  Tupaki Desk   |   5 July 2016 9:48 AM GMT
టెర్రరిస్టుల కోసం స్కూళ్ళ సిలబస్‌ మార్చాలా?
X
మొన్న బంగ్లాదేశ్‌ రాజధాని దాకా లో జరిగిన టెర్రర్ దాడుల గురించి తెలిసిందే. ఒక హోటల్ లో హోస్టేజ్‌ సిట్యుయేషన్‌ క్రియేట్‌ చేసిన తీవ్రవాదులు.. అక్కడ నమాజ్‌ చదవడం వచ్చిన వారిని.. ఖురాన్‌ లోని కొన్ని వాక్యాలు చెప్పడం వచ్చిన వారిని మాత్రం ఏమీ చేయకుండా వదిలేశారు. అయితే ప్రపంచంలో ఇలాంటి సిట్యుయేషన్‌ ఎప్పుడు వచ్చినా కూడా.. జనాలకు ఏమవ్వకూడదంటే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దగ్గర ఒక ఐడియా ఉందట.

ప్రతీ స్కూల్లోనూ కురాన్ చదవడం కంపల్సరీ చేయమంటున్నాడు రాము. ''ఏ మతం నుండి వచ్చినవారైనా కూడా స్కూల్లో ఖురాన్‌ చదువుకుంటే.. ఇలాంటి సిట్యుయేషన్‌ లో ఉపయోగపడుతుంది. అదే మంచి ఎస్కేప్ ఆప్షన్‌. హిందువులూ - క్రీస్టియన్లూ కూడా ఖురాన్‌ చదువుకుంటే.. అప్పుడు టెర్రరిస్టుల నుండి ఈజీగా తప్పించుకోవచ్చు'' అంటూ చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. అయితే ఇలా చెబుతూనే మరో పంచ్‌ వేస్తున్నాడు కూడా. ''మీ సొంత మతం మిమ్మల్ని కాపాడలేకపోతే ఖురాన్‌ అయినా కాపాడుతుంది'' అంటూ చివర్లో మనోడు చెప్పడం కాసింత వివాదానికి దారి తీస్తోంది.

ఇప్పటికే వినాయకుడి మీద చేసిన కామెంట్లకు ఒక కోర్టు కేసును ఎదుర్కొంటున్న రామ్‌ గోపాల్‌ వర్మ.. ఇప్పుడు ఇలా మతాల గురించి ప్రస్తావించడం ద్వారా ఇంకా ఇబ్బంది పడే ఛాన్సుందేమో. టెర్రరిస్టుల కోసం స్కూళ్ళో సిలబస్‌ మార్చమంటున్నాడంటే.. చూద్దాం జనాలు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో!!