Begin typing your search above and press return to search.

'శ్రీ‌వారి' మీద ఒట్టు వేసిన వ‌ర్మ‌!

By:  Tupaki Desk   |   22 Oct 2018 6:51 AM GMT
శ్రీ‌వారి మీద ఒట్టు వేసిన వ‌ర్మ‌!
X
వ‌ర్మ చ‌ర్య‌లు ఊహాతీతం అన్న సంగ‌తి తెలిసిందే. ఆర్జీవీ నిర్ణ‌యాలు ఊస‌ర‌వెల్లిలా మారుతుంటాయి. `లక్ష్మీస్ ఎన్టీఆర్ `తో స‌డెన్ గా వార్త‌ల్లో నిలిచిన వ‌ర్మ‌...ఆ త‌ర్వాత వ‌రుస‌గా సంచ‌ల‌న పోస్ట్ ల‌తో త‌న ఫేస్ బుక్ ఖాతాలో రెచ్చిపోతున్నాడు. తాను నాస్తికుడ‌ని ప్ర‌క‌టించుకున్న వ‌ర్మ‌....స‌డెన్ గా ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ స‌క్సెస్ కావాల‌ని కోరుతూ క‌లియుగ దైవం వెంక‌టేశ్వర స్వామిని కోరుకున్నాడు. మోక్ష‌గామిగా మారిన‌ వ‌ర్మ‌ను చూసి ఆయ‌న ఫ్యాన్స్ కూడా అవాక్క‌య్యారు. ఇపుడు తాజాగా వ‌ర్మ‌.....వెంక‌టేశ్వ‌ర స్వామి మీద ఒట్టు వేసి మ‌రీ ఓ విష‌యాన్ని బ‌ల్ల‌గుద్ది చెబుతున్నాడు. `లక్ష్మీస్ ఎన్టీఆర్ `చిత్రానికి క‌ల్యాణి మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నార‌ని - అయితే - కీర‌వాణి తమ్ముడైన క‌ల్యాణి మాలిక్ ను ఉద్దేశ్య‌పూర్వ‌కంగా ఎంచుకోలేద‌ని వెంక‌టేశ్వ‌ర స్వామి మీద ఒట్టు వేసి మ‌రీ చెబుతున్నాన‌ని వ‌ర్మ అన్నాడు. తాజాగా, త‌న ఫేస్ బుక్ ఖాతాలో వ‌ర్మ పెట్టిన పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

క్రిష్ - బాల‌కృష్ణ‌ల కాంబోలో తెర‌కెక్కుతోన్న ఎన్టీఆర్ బ‌యోపిక్ కు ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా `లక్ష్మీస్ ఎన్టీఆర్ `చిత్రానికి కీర‌వాణి సోద‌రుడు క‌ల్యాణి మాలిక్ సంగీతాన్ని అందిస్తున్నార‌ని వ‌ర్మ త‌న ఎఫ్ బీ ఖాతాలో పోస్ట్ చేశాడు. మాలిక్ ...కీర‌వాణి సోద‌రుడు కావ‌డం కేవ‌లం యాదృచ్ఛికం మాత్ర‌మేన‌ని - ఆయ‌నను ఉద్దేశ్య‌పూర్వకంగా ఎంచుకోలేద‌ని వ‌ర్మ అన్నాడు. వెంక‌టేశ్వ‌ర స్వామి మీద ఒట్టు వేసి ఈ విష‌యాన్ని చెబుతున్నాన‌ని వ‌ర్మ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ పై నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. చూడ‌బోతే...`లక్ష్మీస్ ఎన్టీఆర్ ` పూర్త‌య్యే నాటికి నాస్తికుడు వ‌ర్మ కాస్తా ...వెంక‌న్న భ‌క్తుడు వ‌ర్మ‌గా మారిపోయేలా ఉన్నాడ‌ని కొంద‌రు కామెంట్స్ పెడుతున్నారు. వ‌ర్మ‌కు వెంక‌టేశ్వ‌ర స్వామి మోక్షం ప్ర‌సాదించాడ‌ని, అందుకే వ‌ర్మ కాస్త ప‌ద్ధ‌తిగా మారాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు.