పవన్ ఫోటోపై వర్మ సెటైర్లు విన్నారా

Tue Oct 10 2017 22:46:48 GMT+0530 (IST)

కాదేది సెటైర్ కు అనర్హం అన్నట్లు ఉంది వర్మ తంతు. మనోడు ఏ విషయం మీద అయినా ఎవ్వరిమీదైనా కూడా చాలా సెటైర్లు వేస్తుంటాడు. ఇప్పుడు అదే తరహాలో కొత్తగా తండ్రైన పవన్ కళ్యాణ్ పై మరోసారి తన పంచుల మోత మోగించాడు ఈ సంచలన దర్శకుడు.ఎలా బయటకు వచ్చిందో తెలియదు కాని.. పవన్ కళ్యాణ్ అప్పుడే పుట్టిన తన పసికందుని ఎత్తుకుని ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చేసింది. దానితో చాలామంది దానిని వైరల్ గా షేర్లు చేస్తూ అభినందనలు తెలియజేశారు. కొందరు సెటైర్లు కూడా వేశారు. అయితే ఇక్కడ లేటు వయస్సులో సంతానం అంటూ సెటైర్ వేసే వారి సంగతి అటుంచితే.. వర్మ మాత్రం ఆ ఫోటోలో 'పవన్ కళ్యాణ్ ఊహించలేనంత క్యూట్ గా ఉన్నాడు' అంటూ కామెంట్ చేశాడు. అంటే అప్పుడే పుట్టిన పసికందుని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అనుకోవాలా? లేదంటే పవన్ ను తిడుతున్నాడు అనుకోవాలా? ఈ సెటైర్ ఎలా అర్దం చేసుకోవాలో పవర్ స్టార్ ప్యాన్స్ కు కూడా అర్ధంకావట్లేదు.

అయితే పవన్ లేటు వయస్సులో తండ్రి కావడం అనేదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అది ఆయన వ్యక్తిగతమైన విషయం అయినప్పటికీ.. ఈ ఫోటో కూడా బయటకు రావడంతో.. ఇది చర్చల్లో భాగమై ఇలా వర్మ నోట సెటైర్లకు తావిచ్చింది. అది సంగతి.