ఆ దేవుళ్లను తీసేసి..పవన్ బొమ్మ పెట్టమన్నాడు

Mon Mar 20 2017 12:16:15 GMT+0530 (IST)

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ ట్వీట్లు చేసేసే విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై తాజాగా చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో వివిధ సందర్భాల్లో పవన్ చెప్పిన మాటల్ని.. కాస్త మార్చేసి మరీ పెట్టిన ఒక ట్వీట్‌ను పవన్ చెప్పినట్లుగా వర్మ భావించినట్లుగా ఉంది.

వేర్వేరు సందర్భాల్లో పవన్ చెప్పిన మాటల్ని కాస్తంత సటైరికల్ గా.. చదివినంతనే ఎటకారం చేసేలా మార్చేసి ఒక ట్వీట్ ను తయారు చేశారు. పవన్ కల్యాణ్ తన ట్వీట్లను ఏ ఫాంట్ తో అయితే.. పోస్ట్ చే్స్తారో..  సరిగ్గా అలాంటి ఫాంట్‌తోనే తయారు చేసిన ఇమేజ్‌ను వర్మకు పోస్ట్ చేశారెవరో. దీనిపై ఆయన స్పందించేశారు.

పవన్ తాను చెప్పిన మాటల్ని కాస్తంత ట్విస్ట్ చేసి తయారు చేసిన ట్వీట్ ఇమేజ్‌లో ఏమున్నదంటే.. "పొలంలో గులాబీ కొమ్మ పాలిపోతే.. ఎందుకు ఎండిపోతున్నావు రా.. అంత కష్టం ఏం వచ్చిందని నిమిరా.. రెండు రోజుల్లో కొమ్మకు కొత్త జీవం వచ్చింది" అని.. "అదిలాబాద్‌లోని ఒక మారుమూల గ్రామానికి వెళ్లాం. తీవ్ర కరవు. పాతాళం వరకూ తవ్వినా నీళ్లు పడలేదు. ఓ చోట అడుగు పెట్టిన వెంటనే గలగలా అన్నసవ్వడి వినిపించింది. మా వాళ్లను తవ్వమన్నా.. నీళ్లు పడ్డాయి" (వాస్తవానికి ఈ విషయాన్ని పవన్ మరీ ఇంత డ్రమటిక్ గా చెప్పలేదు. కాకుంటే.. అటూఇటూగా విషయం ఇదే. కానీ.. పవన్ చెప్పిన మాటల్ని కాస్తంత డ్రమటైజ్ చేసి వర్మ పోస్ట్ గా పెట్టారు) అన్న వ్యాఖ్యల్ని ఫోటోగా పెట్టేసిన  దానిపైన తనదైన శైలిలో కామెంట్ పెట్టేశారు.

తాను పీకేను దేవుడిగా నమ్ముతానని.. అందుకే తిరుమల బాలాజీ.. యాదగిరిగుట్ట.. భద్రాద్రిలో దేవతామూర్తుల్ని తీసేసి.. పవన్ తో రీప్లేస్ చేయాలని వ్యాఖ్యానించారు. వర్మ పోస్ట్ ను చూసి కొందరు కామెడీ చేసుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఇంత ఎటకారం అవసరమా అంటూ మండిపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/