అందుకే జీఎస్టీ అని టైటిల్ పెట్టాను...వర్మ!

Sun Jan 21 2018 13:03:33 GMT+0530 (IST)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన జీఎస్టీ ‘గాడ్ - సెక్స్ అండ్ ట్రూత్’ హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించిన ఆ వీడియోలో అశ్లీలత తీవ్రస్థాయిలో ఉందని పలువురు గగ్గోలు పెడుతున్న విషయం విదితమే. ఓ న్యూస్ చానెల్ డిబేట్ లో సామాజిక కార్యకర్త దేవిని - ప్రముఖ సెక్సాలజిస్టు డాక్టర్ సమరంను వర్మ కొన్ని అభ్యంతరకర ప్రశ్నలతో ఇరుకున పడేశాడు. `జీఎస్టీ`ని నిషేధించాలంటూ పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 26న ఆ వీడియో రిలీజ్ కాబోతోన్న నేపథ్యంలో....ఓ ప్రముఖ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ అనేక సంచలన వ్యాఖ్యలు చేశాడు.సెక్స్ అనేది భగవంతుడు(గాడ్) క్రియేట్ చేశాడని - కేవలం పిల్లలు పుట్టించడానికే స్త్రీ పురుషులు సెక్స్ చేయరని - తమ ఆనందం కోసం సెక్స్ చేసే క్రమంలో పిల్లలు పుడతారని ఆ `జన్మ` రహస్యాన్ని వర్మ చెప్పేశాడు. చాలా చోట్ల సెక్స్ అనేది నాలుగు గోడలకే పరిమితమైన అంశమని ప్రజల్లో ఓ రకమైన అపరాధ భావాన్ని కొందరు కలిగించారని చెప్పాడు. భగవంతుడు క్రియేట్ చేసిన సెక్స్ వెనుక ఉన్న అసలు నిజాన్ని తెలియజేసే ఉద్దేశంతోనే తన వీడియోకు` గాడ్ సెక్స్ అండ్ ట్రూత్` అనే పేరు పెట్టానని వర్మ తెలిపాడు. ఒక అందమైన అమ్మాయిని చూసినపుడు మనసుకు ఆహ్లాదం కలుగుతుందని నగ్నంగా ఉన్న స్త్రీ....ప్రపంచంలోకెల్లా అందమైన విషయమని అన్నారు. తాను చెప్పదలుచుకున్న కాన్సెప్ట్ ను మేధావులతో చెప్పించడం కన్నా....నగ్నంగా ఉన్న ఒక అందమైన స్త్రీ చెబితే ....ఆ కాన్సెప్ట్ కు కళారూపం వస్తుందని అందుకే ఆమెతో చెప్పించానని అన్నారు. పోర్న్ స్టార్లలో మియా మాల్కోవాకున్న అందం శరీర సౌష్టవం తనను ఆకట్టుకున్నాయని అందుకే ఆమెను ఎంచుకున్నానని అన్నాడు.

ఇప్పటివరకు వచ్చిన యుద్ధాలన్నీ.....స్త్రీ కోసమే జరిగాయని...కాంతా కనకంతోనే మనిషి జీవితం ముడిపడి ఉందని వర్మ చెప్పాడు. ఆఖరికి స్వర్గానికి వెళితే రంభ ఊర్వశి మేనకలు దొరుకుతారని చెప్పడం వెనుక కూడా సెక్స్ ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ భావ ప్రకటన స్వేచ్ఛను ఏదో రకంగా వినియోగించుకుంటారని... తాను సినీరంగానికి చెందిన వ్యక్తిని కాబట్టి చెప్పాలనుకున్న విషయం ఏదైనా...సెక్స్ - వయిలెన్స్ - హారర్...సినిమాల ద్వారా...చెబుతానన్నాడు. మంచి - చెడులు....మనిషి చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటాయని ఎవరికి ఏది మంచిదని ఒక వ్యక్తి నిర్ణయించడం - మరొకరిపై రుద్దడం సరికాదన్నారు. ప్రపంచంలో పోర్న్ చూసే దేశాలలో మూడో అతి పెద్ద దేశం భారత్ అని - తన `జీఎస్టీ` వీడియోను మెజారిటీ సభ్యులు వ్యతిరేకించడం లేదని చెప్పారు. తాను పోర్న్ ను ప్రచారం చేయడం లేదని ఆల్రెడీ ఎవరికి నచ్చినపుడు వారు పోర్న్ చూస్తున్నారని అన్నారు తన `జీఎస్టీ` వల్లే పోర్న్ గురించి...విచ్చలవిడి ప్రచారం కలిగిందనడం మూర్ఖత్వమన్నారు. సన్నీ లియోన్ పాల్గొన్న హిందీ బిగ్ బాస్ షోకు అత్యధిక టీఆర్పీ వచ్చిందని ఆమె కొచ్చి వెళితే 4 లక్షల మంది జనం వచ్చాని గుర్తు చేశారు.