చంద్రబాబు - లక్ష్మీపార్వతి ఎవరు విలన్ అంటే.?

Sun Oct 21 2018 20:00:01 GMT+0530 (IST)

రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సంచలనాలకు తెరతీస్తోంది. వర్మ ఏం తీస్తాడు.. ఏం చూపిస్తాడన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ ను ఆయన కుమారుడు తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ ను శూరుడుగా.. చంద్రబాబును ధీరుడుగా చూపించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ వర్మ తీసే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబే విలన్ గా చూపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.. దీనిపై వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు విలన్లు ఎవరూ ఉండరని వర్మ కుండబద్దలు కొట్టారు. ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని కలిశాక ఏం జరిగిందనేది తాను చూపిస్తానని..ఇందులో ఎన్టీఆర్ గురించి వ్యతిరేకంగా ఒక్క శాతం కూడా ఉండదని హామీ ఇచ్చారు. అలాగే ఎన్టీఆర్ చనిపోయే ముందు చెప్పిన వీడియోలో లక్ష్మీ పార్వతి గురించి గొప్పగా చెప్పాడని ఆమె గురించి కూడా తన సినిమా నెగెటివ్ గా ఉండదని వర్మ స్పష్టం చేశారు..

ఇక అందరూ అనుకున్నట్టు చంద్రబాబును విలన్ గా చూపించనని...కానీ ఎన్టీఆర్ అధికారం కోల్పోయాక జరిగిన పరిణామాల్లో ఎవరెవరు ఏం చేశారని చూపిస్తానని.. దాన్ని బట్టి ప్రేక్షకులే నిర్ణయించుకోవాలని వర్మ ట్విస్ట్ ఇచ్చాడు. దీన్ని బట్టి పరోక్షంగా చంద్రబాబునే విలన్ గా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.