నెటిజన్ల కామెంట్లకు వర్మ ఘాటు రిప్లై!

Sun Jan 21 2018 11:26:15 GMT+0530 (IST)

తన సినిమాలతో ఇంటర్వ్యూలతో సోషల్ మీడియా పోస్టులతో వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. సినిమాలు మొదలుకొని సామాజిక అంశాల వరకు అన్ని అంశాలపైనా వర్మ తనదైన శైలిలో మీడియాలోనో ...సోషల్ మీడియాలోనో స్పందిస్తుంటాడు. కొద్ది రోజుల క్రితం `లక్ష్మీస్ ఎన్టీఆర్`తెరకెక్కించబోతున్నానని ప్రకటించిన వర్మపై టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులు కార్యకర్తలు...సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం...వర్మ కూడా ఏమాత్రం తగ్గకుండా వారందరికీ ఘాటుగా రిటార్ట్ ఇవ్వడం....వర్మకు జవాబు చెప్పలేక వారంతా కామ్ అయిపోవడం తెలిసిందే. తాజాగా తన రిటార్ట్ ల పర్వంలో వర్మ మరో అడుగు ముందుకు వేశాడు. సోషల్ మీడియాలో తనను అసభ్య పదజాలంతో దూషించిన నెటిజన్లకు రిటార్ట్ ఇస్తూ....ఏకంగా ఓ న్యూస్ చానెల్ వాళ్లకు వీడియో బైట్ ఇచ్చాడు వర్మ. ఇపుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.`అజ్ఞాతవాసి` సినిమాపై సోషల్ మీడియాలో వర్మ తనదైన శైలిలో కామెంట్లు గుప్పించిన సంగతి తెలిసిందే. దానికి హర్టయిన కొందరు నెటిజన్లు...వర్మను బూతులు తిడుతూ...కామెంట్లు పెట్టారు. అయితే వర్మ ఏమాత్రం తగ్గకుండా వారిలో కొందరికి ఘాటుగా బదులిచ్చారు.`అరె బచ్చా....నువ్వూ నీ చిల్లర వేషాలు....నీకు రాలేదా ఫ్లాప్స్....ఎగతాళి చేసేముందు నీ బ్రతుకు ఆలోచించు చెత్త....`అంటూ ట్వీట్ చేశాడు. తనను చెత్త వెధవ అని సంబోధిస్తూనే.... తాను చేసే పోస్టుల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారంటే....వారెంత చెత్త వెధవలు అయి ఉంటారో అని తనకు ఆశ్చర్యంగా ఉందని వర్మ ఘాటుగా రిటార్ట్ ఇచ్చాడు. `అసలు అజ్ఞాతవాసి సినిమాను ఎవడు చూడమన్నాడు.నచ్చకపోతే చూడకు..నీ మాటల వల్ల నీ మీద ఉన్న అభిమానం కూడా పోగొట్టుకుంటున్నావు` అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. సినిమా చూడకముందే నచ్చలేదని ఎలా చెబుతామని....చూశాకే కదా తెలిసేది కామెంట్ చేసేది అని రిటార్ట్ ఇచ్చాడు. వర్మలా కావాలని కత్తి మహేశ్ ట్రై చేస్తున్నాడని....తమకు మరో వర్మ వద్దని...మరో కామెంట్ రాగా.....ఆ విషయం మహేశ్ కు చెప్పమని సలహా ఇచ్చాడు వర్మ. అన్నం పెట్టిన పరిశ్రమకు చెందిన మరో సినిమాపై ఇలాంటి కామెంట్లు చేయడం ఏమిటన్న ప్రశ్నకు వర్మ అదిరిపోయే జవాబిచ్చాడు. తాను అసలు అన్నం తిననని...వోడ్కా తాగుతానని బదులిచ్చాడు. ఓ న్యూస్ చానెల్ వాళ్లు వర్మ ఘాటు రిప్లైల పై ఏకంగా ఓ ప్రొమో వీడియోను టెలికాస్ట్ చేశాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో అయితే తనను కామెంట్ చేసిన వారి ఐడెంటిటీని రివీల్ చేయలేదు...వర్మకు గనక తిక్కరేగితే....తర్వాతి వీడియోలో వాళ్ల ప్రొపైల్స్ ను కూడా పబ్లిక్ చేసేసి మరీ రిటార్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే...వర్మ...దట్స్ ద `బ్యూటీ`!