పవన్ కు మోదీకి లింక్ పెట్టిన వర్మ!

Sun Jan 21 2018 15:29:33 GMT+0530 (IST)

గత 4 నెలలుగా మీడియా - సోషల్ మీడియాలో....కత్తి మహేశ్- పవన్ ఫ్యాన్స్ ల మధ్య వివాదం తారస్థాయికి చేరడం....రెండు రోజుల క్రితం ఆ వివాదానికి ఇరువర్గాలు తెరవేయడం తెలిసిందే. తాజాగా ఆ వివాదంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఓ న్యూస్ చానెల్ ప్రతినిధికి ఇచ్చిన పర్సనల్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. కత్తిమహేశ్ పై పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ దాడి....వీటిపై పవన్ వ్యక్తిగతంగా స్పందించాలి...క్షమాపణలు చెప్పాలనడం కరెక్ట్ కాదని వర్మ అన్నారు. కొన్ని కోట్ల మంది అభిమానులున్న ఆయనను....వారిలో కొందరు చేసిన తప్పుకు బాధ్యత తీసుకోమని డిమాండ్ చేయడం సరికాదన్నారు. ఒక విదేశీ టూరిస్ట్ పై భారతీయులు దాడిచేస్తే....భారతీయులెవరూ ఇటువంటి పనులు చేయవద్దని ప్రధాని మోదీ బాధ్యత తీసుకోవాలనడం హాస్యాస్పదమన్నారు.  తనకు రాజకీయాలపట్ల ఆసక్తి లేదని....తనకు పవన్ కల్యాణ్ అంటే వ్యక్తిగతంగా ఇష్టమని అన్నారు. ప్రజలు జీవితాల్లో మార్పులు తెచ్చి...వాటిని వారు గుర్తించగలిగినట్టు చేయగలిగిన వాడే నాయకుడన్నారు. పార్టీ ప్రకటించే రోజు....రజనీ మాట్లాడే విధానం - తీరు - నమ్మకం - నచ్చాయని....తమిళ రాజకీయాల్లో పెనుమార్పులు తెస్తాడన్న నమ్మకం ఉందన్నారు.తన కంపెనీ కింద రకరకాల దర్శకులంతా వెబ్ సిరీస్ లు - షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారని నాగ్ తో సినిమా తానే చేస్తున్నానని చెప్పారు. ఆ చిత్రానికి శివకు ఎటువంటి సంబంధం లేదని వచ్చే మేలో ఆ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా షూటింగ్ ను ఈ ఏడాది మార్చిలో ప్రారంభిస్తానని రాబోయే ఏడాది ఎన్నికల విడుదలకు ముందే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తామన్నారు. `లక్ష్మీస్ వీరగ్రంథం` - బాలయ్య-తేజ ల కాంబోలో తెరకెక్కబోతోన్న బయోపిక్ పై తాను స్పందించనన్నారు. ఎన్టీఆర్ మీది 100 మంది సినిమాలు వంద రకాలుగా సినిమా తీసే హక్కు వారికుందని తెలిపారు. ఈ చిత్రాల తర్వాత ఓ బాలీవుడ్ మూవీ చేస్తానని 300 కోట్లతో రూపొందించబోతోన్న మరో చిత్రం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. భవిష్యత్తులో మీడియాను....సోషల్ మీడియా డామినేట్ చేస్తుందన్నారు. అంతేకాకుండా ఆన్ లైన స్ట్రీమింగ్ -  వీఆర్ టెక్నాలజీ విరివిగా  అందుబాటులోకి వచ్చాక బాత్రూంలో కూర్చొని డిజిటల్ క్వాలిటీ తో సినిమాచూడొచ్చని....భవిష్యత్తులో థియేటర్లు అలంకారప్రాయంగా మారతాయని వర్మ జోస్యం చెప్పారు. ప్రస్తుతం మియా మాల్కోవా తన మైండ్ లో తిరుగుతోందని తను నా దేవతని అన్నారు.

గతంలో ట్విట్టర్ లో బోర్ కొట్టి వెళ్లానని ఇపుడు రావాలనిపించి వచ్చానని...అయినా తాను చెప్పిన ప్రతిమాట నమ్మడం ఏమిటని చమత్కరించారు. సోషల్ మీడియా - యూట్యూబ్  ప్రపంచ హద్దులను చెరిపేసిందని ఎవరికి నచ్చిన విషయాలను వారు పబ్లిక్ డొమైన్ లో పంచుకోవచ్చన్నారు. ఒక దేశ చట్టాలను గౌరవిస్తూనే....తన భావ ప్రకటన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకున్నపుడు....ఆ వ్యక్తి ముందుకు పోగలడని చెప్పారు. దానినే తాను వాడుకుంటున్నానని అన్నారు. తనను విమర్శిస్తున్న కొంతమందికి తాను సుబ్బారావు అని పేరుపెట్టానని తెలిపారు. భారతదేశంలో స్వాతంత్ర్యానంతరం స్వేచ్ఛగా జీవిస్తున్నవ్యక్తి తానేనని ఒకరు అన్నారని వర్మ చెప్పారు. అంతే స్వేచ్ఛగా ఇకపై కూడా బ్రతుకుతానని - తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తానని అన్నారు.