Begin typing your search above and press return to search.

నాతో పెట్టుకోకండి నేను నయీంలకే నయీం

By:  Tupaki Desk   |   27 Sep 2016 4:18 AM GMT
నాతో పెట్టుకోకండి నేను నయీంలకే నయీం
X
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సంచలనాత్మకమైన స్టేట్మెంట్స్ ఇవ్వడంలో మహా దిట్ట. ఈయన సినిమాల్లో ఇంటెన్సిటీ ఏటేటా తగ్గుతోందని ఫ్యాన్స్ ఫీలవుతున్నా.. కామెంట్స్ లో మాత్రం కౌంట్.. కంటెంట్ రోజురోజుకూ పెరుగుతూ ఉండడం విశేషమే. ప్రస్తుతం గ్యాంగ్ స్టర్ నయీం స్టోరీని తెరకెక్కిస్తున్నాడు వర్మ. జనవరిలో రిలీజ్ అని ఇప్పటికే చెప్పేశాడు కూడా. అయితే.. తనకు నయీం అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ.. ట్విట్టర్ పక్షి సాక్షిగా తన గోడపై రాసేశాడు.

వెనకాల గాడ్ అని రాసి ఉన్న తన ఓ స్కెచ్ ని పోస్ట్ చేసిన వర్మ.. 'నాకు నయీం గ్రూప్ నుంచి బెదరింపు కాల్స్ వస్తున్నాయి. కానీ వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. నేను నయీంలకే నయీంని. ప్రస్తుతం నేను ముంబైలో నయీంకి జైల్ మేట్ తో ఉన్నా. ఇప్పటివరకూ నయీం గురించి తెలిసిన ఐదుగురు పోలీసలను కలిశా. మూడేళ్ల పాటు అతనితో కలిసి పనిచేసిన ఇద్దరకు నక్సలైట్స్ ను కలిశా. నాకు క్రిమినల్ వరల్డ్ గురించి ఇంతగా తెలిసినా.. కరాచీలో ఓ బడా వ్యక్తితో నయీంకి సంబంధాలు ఉన్నాయని తెలిసి షాక్ తిన్నాను' అంటూ.. నాతో పెట్టుకోకండి అని డైరెక్టుగా చెప్పకనే చెప్పాడు వర్మ అలియాస్ నయీంలకే నయీం.

వర్మ చెప్పినదంతా బాగానే ఉంది కానీ.. ఈ బెదిరింపుల విషయంలోనే ప్రచారం కోసం ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడా అనిపించక మానదు. వంగవీటి విషయంలో కూడా ఇలాంటి హంగామానే చేసి.. విజయవాడంతా పోస్టర్స్ పెట్టించి ప్రచారం చేసుకున్నాడు. ఆ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు కానీ.. ఇప్పుడు నయీం నుంచి బెదిరింపులంటూ కొత్తగా ఇంటెన్సిటీ ఉన్న మాటలు చెబుతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/