Begin typing your search above and press return to search.

దర్శకులంతా వేరే గ్యాంగ్ పెట్టుకోక ముందు...

By:  Tupaki Desk   |   9 Oct 2015 5:30 AM GMT
దర్శకులంతా వేరే గ్యాంగ్ పెట్టుకోక ముందు...
X
తెలుగు సినీ చరిత్రలో 'శివ' సినిమా ప్రత్యేక స్థానం సంపాదించుకుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులను ఉత్తేజపరచడమే కాక మన టాలీవుడ్ కి ఎంతో మంది కొత్త టెక్నీషియన్లను అందించింది.

రామ్ గోపాల్ వర్మ లైమ్ లైట్ లోకి వచ్చిన శివ సినిమాకు నేటి తరం పెద్ద డైరెక్టర్లు అసిస్టంట్ లుగా పనిచేశారు. తేజ - కృష్ణవంశీ - గుణశేఖర్ - ఉత్తేజ్ - గోపీచంద్ - శివ నాగేశ్వరరావు వంటి వారు శివ సినిమాతోనే వెలుగులోకి వచ్చారు. అయితే ఆ సమయంలో తీసుకున్న ఫోటో ఒకటి రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. రుద్రమదేవి విడుదల సందర్భంగా గుణశేఖర్ ని స్మరిస్తూ ఈ ఫోటో పెట్టినట్టు గా తెలుస్తుంది. "మేమందరం .. వేరే గ్యాంగ్ పెట్టుకోక ముందు" అనే ట్యాగ్ లైన్ ని అందించడం హై లైట్.. అలనాటి పిక్ మీకోసం...